పత్తికొండ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 Live

By Sambi Reddy  |  First Published Jun 4, 2024, 8:02 AM IST

కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్య జరిగిన ఆధిపత్య పోరులో ఇరుపార్టీలకు చెందిన నేతలు పత్తికొండపై పెత్తనం చెలాయించేందుకు పోటీపడ్డారు. ఎన్నికల్లో పోటీపడటం.. గెలిచిన అభ్యర్థి.. ఓడిన అభ్యర్థి పై పగతీర్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఒకటి రెండు సార్లు తప్పించి 1979 నుంచి 2017 వరకు పత్తికొండ ఫ్యాక్షన్ రాజకీయాలకు రాజధానిగా మారింది.  1952లో ఏర్పడిన పత్తికొండ నియోజక వర్గం మొత్తం ఓటర్ల సంఖ్య 2,06,538 మంది. కాంగ్రెస్, టీడీపీలకు ఈ నియోజకవర్గం కంచుకోట. కాంగ్రెస్ 6 సార్లు, టీడీపీ ఆరు సార్లు, స్వతంత్రులు మూడు సార్లు, వైసీపీ ఒకసారి విజయం సాధించాయి. పత్తికొండలో ఎస్వీ సుబ్బారెడ్డి , కేఈ కృష్ణమూర్తి కుటుంబాలదే ఆధిపత్యం. ఈ రెండు కుటుంబాలు కాంగ్రెస్, టీడీపీలలో రాజకీయాలు చేశాయి.  మరోసారి ఇక్కడ గెలవాలని జగన్ పావులు  కదుపుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీదేవికి మరోసారి అవకాశం కల్పించారు. టీడీపీ నుంచి కేఈ శ్యామ్ బాబు మరోసారి అదృష్టం పరీక్షించుకుంటున్నారు. 
 


ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పత్తికొండ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత వుంది. కర్ణాటక సరిహద్దుల్లోకి కొన్ని పల్లెలు విస్తరించడంతో విభిన్న భౌగోళిక పరిస్ధితులు , సంస్కృతి, సంప్రదాయాలు ఇక్కడ నెలకొంటాయి. అన్ని రకాలుగా వెనుకబడిన ఈ ప్రాంతంలో పేద, మధ్య తరగతి కుటుంబాలు ఎక్కువ. ఇప్పటికీ పత్తికొండ నియోజకవర్గంలో రైతు కూలీలు, వలస వెళ్లే కూలీలే దర్శనమిస్తారు. ఒకప్పుడు కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్య జరిగిన ఆధిపత్య పోరులో ఇరుపార్టీలకు చెందిన నేతలు పత్తికొండపై పెత్తనం చెలాయించేందుకు పోటీపడ్డారు. 

పత్తికొండ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 .. ఫ్యాక్షన్ రాజకీయాలకు ఖిల్లా :

Latest Videos

undefined

టీడీపీ ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్‌తో ఆ పార్టీ పోటీపడింది. ఎన్నికల్లో పోటీపడటం.. గెలిచిన అభ్యర్థి.. ఓడిన అభ్యర్థి పై పగ తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఒకటి రెండు సార్లు తప్పించి 1979 నుంచి 2017 వరకు పత్తికొండ ఫ్యాక్షన్ రాజకీయాలకు రాజధానిగా మారింది. ఎర్రగుడి ఈశ్వర్ రెడ్డి, మహాబలేశ్వర గుప్తా, రామకృష్ణారెడ్డి, సి నారాయణ రెడ్డి, వెంకటప్పనాయుడు, శేషిరెడ్డి వంటి నేతలను ప్రత్యర్ధులు దారుణంగా హతమార్చారు. వీరిలో కొందరు  ఎమ్మెల్యేగా గెలిచి కనీసం ప్రమాణ స్వీకారం కూడా చేయనివారు వున్నారు. ఈ నియోజకవర్గంలోని 77 గ్రామాల్లో ఇప్పటికీ ఫ్యాక్షన్ ఛాయలు వున్నాయని అంచనా.  

1952లో ఏర్పడిన పత్తికొండ నియోజకవర్గం మొత్తం ఓటర్ల సంఖ్య 2,06,538 మంది. కాంగ్రెస్, టీడీపీలకు ఈ నియోజకవర్గం కంచుకోట. కాంగ్రెస్ 6 సార్లు, టీడీపీ ఆరు సార్లు, స్వతంత్రులు మూడు సార్లు, వైసీపీ ఒకసారి విజయం సాధించాయి. పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కృష్ణగిరి, వెల్దుర్తి, పత్తికొండ, మద్దికెర, తుగ్గలి మండలాలున్నాయి. పత్తికొండలో ఎస్వీ సుబ్బారెడ్డి , కేఈ కృష్ణమూర్తి కుటుంబాలదే ఆధిపత్యం. ఈ రెండు కుటుంబాలు కాంగ్రెస్, టీడీపీలలో రాజకీయాలు చేశాయి. 

పత్తికొండ శాసనసభ ఎన్నికల ఫలితాలు 2024 .. వైసీపీలో సహాయ నిరాకరణ :

వృద్ధాప్యంతో ఎస్వీ సుబ్బారెడ్డి రాజకీయాలకు దూరమవ్వగా.. ఆయన కుమార్తె నాగరత్నమ్మ హవా సాగుతోంది. ఆమె భర్తతో కలిసి పదేళ్ల కిందట వైసీపీలో చేరారు. కానీ వీరికి పోటీ చేసేందుకు అవకాశం లభించడం లేదు. పత్తికొండకు చెందిన వైసీపీ ఇన్‌ఛార్జ్‌ నారాయణ రెడ్డిని 2017లో ప్రత్యర్ధులు హత్య చేయడంతో ఆయన సతీమణి శ్రీదేవికి జగన్ 2019 టికెట్ కేటాయించారు. ఆ ఎన్నికల్లో ఆమెకు 100,100 ఓట్లు పోలవ్వగా.. టీడీపీ అభ్యర్ధి కేఈ శ్యామ్ కుమార్‌కు 58,125 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా వైసీపీ 43 వేల ఓట్ల మెజారిటీతో పత్తికొండలో తొలిసారి పాగా వేసింది. 

పత్తికొండ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 .. పట్టుదలగా కేఈ కుటుంబం :

2024 ఎన్నికల విషయానికి వస్తే.. మరోసారి ఇక్కడ గెలవాలని జగన్ పావులు  కదుపుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీదేవికి మరోసారి అవకాశం కల్పించారు. అయితే ఆమెకు ఎస్వీ సుబ్బారెడ్డి , రామచంద్రారెడ్డి కుటుంబాలు సహకరిస్తాయా అన్నది అనుమానమే. ఇప్పటికే నాగరత్నమ్మ అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నుంచి కేఈ శ్యామ్ బాబు మరోసారి అదృష్టం పరీక్షించుకుంటున్నారు. కేఈ కుటుంబానికి వున్న బ్రాండ్ నేమ్, టీడీపీ జనసేన బీజేపీ పొత్తుతో తాను గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

click me!