పోలవరం పనుల్లో అపశృతి.. ఒకరు మృతి

Published : Apr 16, 2019, 11:03 AM IST
పోలవరం పనుల్లో అపశృతి.. ఒకరు మృతి

సారాంశం

పోలవరం పనుల్లో అపశృతి చోటుచేసుకుంది. ప్రాజెక్టు స్పిల్ వే నిర్మాణ ప్రాంతంలో గేట్లు అమర్చే పనులు చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఓ కార్మికుడు మృతి చెందాడు. 

పోలవరం పనుల్లో అపశృతి చోటుచేసుకుంది. ప్రాజెక్టు స్పిల్ వే నిర్మాణ ప్రాంతంలో గేట్లు అమర్చే పనులు చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఓ కార్మికుడు మృతి చెందాడు. మరో కార్మికుడు తీవ్రగాయాలపాలయ్యాడు. కాగా అతనిని చికిత్స నిమిత్తం రాజమండ్రి ఆస్పత్రికి తరలించారు. 

సోమవారం ఉదయం గేట్ల పనులు జరుగుతుండగా..  భీమిలేష్ కుమార్ రామ్(22) అనే యువకుడిపై రాడ్డు పడింది. వెంటనే ఆస్పత్రికి తరలించినా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడు జార్ఖండ్ కి చెందిన వ్యక్తిగా గుర్తించారు.

అదే సమయంలో 15 బ్లాక్ లో పనిచేస్తున్న సతీష్ అనే యువకుడు స్పిల్ వే పై నుంచి కిందకు జారి పడ్డాడు. దీంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. తొలుత పోలవంర ఆస్పత్రికి తరలించగా.. అనంతరం మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి తరలించారు.ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంవల్లే భీమిలేష్‌ మృతిచెందాడంటూ కార్మికులు ఆందోళనకు దిగారు. స్పిల్‌వే సమీపంలో ఉన్న నవయుగ ఏజెన్సీ క్యాంప్‌ కార్యాలయానికి చేరుకుని ఆగ్రహంతో రాళ్లు రువ్వడంతో అక్కడున్న ఓ వాహనం స్వల్పంగా దెబ్బతింది
 

PREV
click me!

Recommended Stories

Hyderabad లో ప్రస్తుతం కిలో టమాటా ధర ఎంత..?
Sankranti Weather : తెలుగోళ్ళకు గుడ్ న్యూస్.. సంక్రాంతి పండక్కి సరైన వెదర్