Omicron Scare: కోనసీమలో ఒమిక్రాన్ టెన్షన్.. ఆ ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ కావడంతో..

Published : Dec 16, 2021, 12:24 PM IST
Omicron Scare: కోనసీమలో ఒమిక్రాన్ టెన్షన్.. ఆ ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ కావడంతో..

సారాంశం

కోవిడ్ ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) వేగంగా వ్యాప్తి చెందుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని (Andhra Pradesh) కొనసీమలో ఒమిక్రాన్ టెన్షన్ నెలకొంది. తూర్పు గోదావరి జిల్లాకు విదేశాల నుంచి వచ్చిన ముగ్గురికి కోవిడ్ పాజిటివ్‌గా (Covid Positive) నిర్దారణ కావడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.   

కోవిడ్ ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) వేగంగా వ్యాప్తి చెందుతోంది. భారత్‌లో కూడా ఒమిక్రాన్ కేసుల్లో పెరుగుదల కనిపిస్తుండగా.. తెలుగు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) ఒక ఒమిక్రాన్ కేసు, తెలంగాణలో రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని కొనసీమలో ఒమిక్రాన్ టెన్షన్ నెలకొంది. తూర్పు గోదావరి జిల్లాకు విదేశాల నుంచి వచ్చిన ముగ్గురికి కోవిడ్ పాజిటివ్‌గా (Covid Positive) నిర్దారణ కావడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. 

విదేశాల నుంచి వచ్చిన వారికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ కావడంతో జిల్లా వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. వారి నుంచి శాంపిల్స్‌ను సేకరించి పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లోని సీసీఎంబీకి పంపించారు. రిపోర్టు వచ్చిన తర్వాత Omicron సోకిందా..? లేదా..? అనేది నిర్దారణ కానుంది. కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయినవారిలో ఒక వ్యక్తి బంగ్లాదేశ్ నుంచి అయినవిల్లి మండలంలోని ఓ గ్రామానికి వచ్చిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. అతనికి ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహిస్తే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని అదనపు డీఎంహెచ్‌వో మీనాక్షి చెప్పారు.

మరో ఇద్దరు భార్యభర్తలు కాగా.. వారు సింగపూర్ నుంచి ఇటీవలే రావులపాలెం రావులపాలెం మండలంలోని ఓ గ్రామానికి ఈ నెల 7వ తేదీన తిరిగి వచ్చారు. వారికి ఆర్టీపీసీఆర్ పరీక్ష నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఈ క్రమంలోనే వైద్యాధికారులు వారిని హోం ఐసోలేషన్‌లో ఉంచారు. మరోవైపు కరోనా పాజిటివ్‌గా తేలిన ముగ్గురి కాంటాక్ట్స్‌ను కూడా అన్వేషించే పనిలో పడ్డారు. 

ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు..
ఆంధ్రప్రదేశ్‌లో తొలి ఒమిక్రాన్ కేసు విజయనగరం జిల్లాలో వెలుగుచూసింది. విజయనగరం జిల్లాలో ఐర్లాండ్‌ నుంచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్‌ సోకినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ధృవీకరించింది. విజయనగరం జిల్లాకు చెందిన ఆ వ్యక్తి గత నెల 27న‌ ముంబై మీదుగా విశాఖపట్నం వచ్చాడు. ముంబైలో అతనికి ఆర్టీపీసీఆర్‌ పరీక్ష చేయగా కొవిడ్‌ నెగెటివ్‌గా వచ్చింది. విశాఖపట్నం చేరుకున్న తర్వాత అధికారులు మరోసారి కరోనా పరీక్ష చేశారు. అందులో పాజిటివ్‌గా వచ్చింది.

దీంతో అతని శాంపిల్స్‌ను సేకరించి  హైదరాబాద్‌లోని సీసీఎంబీకి జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం పంపించారు. అందులో అతనికి ఒమిక్రాన్ సోకినట్టుగా నిర్దారణ అయింది. దీంతో అతని కాంటాక్స్‌ను పరిశీలిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : దేశవ్యాప్తంగా వర్షాలు, ఈ తెలుగు జిల్లాల్లోనూ.. ఎల్లో అలర్ట్ జారీ
Humanoid Robot Introduced at Visakhapatnam Railway Station | Waltair Division | Asianet News Telugu