ఆటలు ఆడిస్తున్నట్లు నటించి... పసిమొగ్గపై వృద్ధుడి పైశాచికం

Siva Kodati |  
Published : Jul 08, 2020, 06:16 PM IST
ఆటలు ఆడిస్తున్నట్లు నటించి... పసిమొగ్గపై వృద్ధుడి పైశాచికం

సారాంశం

కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది. మనవరాలిని అప్యాయంగా దగ్గరకు తీయాల్సిన వృద్ధుడు.. కామంతో పసిమొగ్గపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 

కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది. మనవరాలిని అప్యాయంగా దగ్గరకు తీయాల్సిన వృద్ధుడు.. కామంతో పసిమొగ్గపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే..  కృష్ణాజిల్లా గన్నవరం మండలం తేలప్రోలు గ్రామానికి చెందిన ఐదేళ్ల బాలిక తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లడంతో ఇంటి దగ్గరే ఆడుకుంటోంది.

అదే ప్రాంతానికి చెందిన వృద్ధుడు చిన్నారులను ఆటల పేరుతో మచ్చిక చేసుకున్నాడు. ఇదే సమయంలో ఆ వృద్దుడిలోని కామాంధుడు నిద్రలేచాడు. ఆటలు ఆడిస్తున్నట్లు నటించి.. దగ్గర ఉన్న ఇసుక గుట్టకు తీసుకెళ్లి బాలికపై లైంగిక దాడికి పాల్పడుతున్నట్లు సమీపంలో ఉన్న కొందరు స్థానికులు చూశారు.

ఇంతలో పాపకు ఏమి జరుగుతోందో కూడా తెలియని పరిస్థితి. ఆ వెంటనే స్థానికులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. లైంగిక దాడికి ప్రయత్నించినట్లు నిర్థారించుకున్న బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు