రోడ్డుప్రమాదంలో గాయపడ్డ యంగ్ హీరో, మహిళ మృతి

Published : Apr 27, 2019, 03:14 PM IST
రోడ్డుప్రమాదంలో గాయపడ్డ యంగ్ హీరో, మహిళ మృతి

సారాంశం

సినిమా ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్ నుంచి గుంటూరుకు కారులో వెళ్తున్నారు. అయితే శనివారం తెల్లవారు జామున సుధాకర్‌ కారు మంగళగిరి మండలం చినకాకాని జాతీయ రహదారిపై అదుపు తప్పింది. మెక్కలకు నీరుపెడుతున్న మహిళను సుధాకర్‌ కారు ఢీకొంది. ఈ ఘటనలో ఆ మహిళ అక్కడికక్కేడే దుర్మరణం చెందింది. 

అమరావతి: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకాని జాతీయ రహదారిపై యువకథానాయకుడు సుధాకర్ కారు అదుపుతప్పింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన సుధాకర్ ప్రస్తుతం నువ్వు తోపురా అనే సినిమాలో నటిస్తున్నారు. 

సినిమా ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్ నుంచి గుంటూరుకు కారులో వెళ్తున్నారు. అయితే శనివారం తెల్లవారు జామున సుధాకర్‌ కారు మంగళగిరి మండలం చినకాకాని జాతీయ రహదారిపై అదుపు తప్పింది. 

మెక్కలకు నీరుపెడుతున్న మహిళను సుధాకర్‌ కారు ఢీకొంది. ఈ ఘటనలో ఆ మహిళ అక్కడికక్కేడే దుర్మరణం చెందింది. అయితే కారులో ఉన్న నటుడు సుధాకర్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.  

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం