ఆక్సిజన్ లేక నా భర్త చనిపోయాడు: సెల్ఫీ వీడియోలో మహిళ కన్నీరు

Published : May 09, 2021, 05:03 PM IST
ఆక్సిజన్ లేక నా భర్త చనిపోయాడు: సెల్ఫీ వీడియోలో మహిళ కన్నీరు

సారాంశం

తన భర్త ఆక్సిజన్ లేకపోవడంతో గిలగిలకొట్టుకొని చనిపోయాడని ఓ మహిళ సెల్ఫీ వీడియో వైరల్ గా మారింది.


విశాఖపట్టణం: తన భర్త ఆక్సిజన్ లేకపోవడంతో గిలగిలకొట్టుకొని చనిపోయాడని ఓ మహిళ సెల్ఫీ వీడియో వైరల్ గా మారింది.విశాఖపట్టణంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కరోనా చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. కరోనా కారణంగా తీవ్రంగా ఇబ్బందిపడుతున్న తన భర్తకు ఆక్సిజన్ అందించలేదని ఆమె ఆ వీడియోలో ఆరోపించారు. ఆక్సిజన్ సౌకర్యం లేకున్నా  ఆసుపత్రిలో చేర్పించుకొని ఆయన మరణానికి కారణమయ్యారని ఆమె ఆరోపించారు.

గంట పాటు తన భర్తకు ఆక్సిజన్ అందక గిలగిల కొట్టుకొని మరణించినట్టుగా ఆమె కన్నీళ్లుపెట్టుకొన్నారు.  తనతోపాటు తన పిల్లలకు ఎవరు దిక్కని ఆమె ప్రశ్నించారు. కరోనా చికిత్స కు అవసరమైన మందులు కూడ తన భర్తకు అందివ్వలేదని ఆమె ఆరోపించారు. ఆక్సిజన్  లేనప్పుడు ఎందుకు ఆసుపత్రిలో చేర్పించుకొన్నారని ఆమె ఆసుపత్రి నిలదీశారు.  తన భర్తను పొట్టనబెట్టుకొన్నారని ఆమె  ఆవేదన వ్యక్తం చేశారు. 

ఈ ఘటనతో  మరోసారి  ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్స విషయంలో ఆసుపత్రుల యకాజమాన్యాలు అనుసరిస్తున్న వైఖరి మరోసారి బట్టబయలైంది. ప్రైవేట్ ఆసుపత్రులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వం నిర్ధేశించిన ధరల మేరకే చికిత్స అందించాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?