పొత్తులపై ఆధారపడను: ఫ్యామిలీ డాక్టర్‌ను ప్రారంభించిన జగన్

By narsimha lode  |  First Published Apr 6, 2023, 1:51 PM IST

ఏపీలో  ఫ్యామిలీ డాక్టర్ పథకాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్  ప్రారంభించారు. ఈ పథకం దేశానికి రోల్ మోడల్ గా మారనుందన్నారు.  


చిలకలూరిపేట:  తనకు  పొత్తుల్లేవ్,  పొత్తులపై తాను  ఆధారపడని  ఏపీ సీఎం వైఎస్ జగన్  తేల్చి  చెప్పారు. మీ బిడ్డ ఒకవైపు, తోడేళ్లంతా మరో వైపు ఉన్నారన్నారు.   మీ బిడ్డను  ఎదుర్కోలేక ఎత్తులు, జిత్తులు, పొత్తులు , కుయుక్తులకు పాల్పడుతున్నారని ఆయన విపక్షాలపై  విమర్శించారు. 
నవరత్నాలతో  మీ బిడ్డ వస్తుంటే  తోడేళ్లంతా  ఒక్కటౌతున్నాయని  సీఎం  చెప్పారు. వాళ్లకు  లేనిది  మీ బిడ్డకు  ఉన్నది  దేవుడి దయ, మీ అందరి ఆశీస్సులని సీఎం జగన్ చెప్పారు. సామాజిక న్యాయం తెలియని  పరాన్న జీవులంటూ  చంద్రబాబు సహా విపక్షాలపై  జగన్ విమర్శలు గుప్పించారు. 

ఉమ్మడి గుంటూరు  జిల్లాలోని  చిలకలూరిపేటలో గురువారంనాడు  ఫ్యామిలీ డాక్టర్ పథకాన్ని  ఏపీ సీఎం వైఎస్ జగన్  ప్రారంభించారు. ఈ సందర్భంగా  నిర్వహించిన సభలో  ఏపీ సీఎం జగన్ ప్రసంగించారు. ;పట్టణ ప్రాంతంలో  అర్భన్ పీహెచ్‌సీలను  ఏర్పాటు  చేసినట్టుగా  చెప్పారు. తమది బతికించే  ప్రభుత్వంగా  జగన్ పేర్కొన్నారు.  అందుకే  ఆరోగ్యశ్రీ సేవలను  మరింత  విస్తృతం  చేసినట్టుగా  జగన్  పేర్కొన్నారు. ఈ పథకం దేశానికే  ఒక రోల్ మోడల్ గా నిలిచిందన్నారు.  ఇప్పటివరకు  ఆరోగ్యశ్రీ సేవలను  35 లక్షల మంది పొందారని ఆయన   చెప్పారు.  

Latest Videos

undefined

దేశంలో  2,500  జనాభాకు  ఒక్క  పీహెచ్‌సీ ఉన్న ఏకైక  రాష్ట్రం  ఏపీ అని  సీఎం గుర్తు  చేశారు.  డాక్టర్ చ మీ గ్రామానికి, ఇంటి వద్దకే వచ్చి చికిత్స అందిస్తారని  ఏపీ సీఎం వైఎస్ జగన్  తెలిపారు.విలేజ్ క్లినిక్ లో స్పెషలిస్టు  డాక్టర్లతో వీడియో కాన్ఫరెన్సులుంటాయన్నారు. స్పెషలిస్టు  డాక్టర్ల  ద్వారా కూడా గ్రామాల్లో వైద్యం అందించనున్నట్టుగా  చెప్పారు. 24 గంటల పాటు  పేదలకు  వైద్యం  అందించనున్నట్టు సీఎం  చెప్పారు.

ప్రతి పీహెచ్‌సీలో  ఇద్దరు డాక్టర్లుంటారని  ఆయన  చెప్పారు.  ప్రతి మండలంలో  రెండు పీహెచ్‌సీలుంటాయని సీఎం జగన్  వివరించారు.  తమ ప్రభుత్వం  96 శాతం  స్పెషలిస్టు డాక్టర్ పోస్టులను భర్తీ చేసిందన్నారు. చంద్రబాబు  సీఎంగా  ఉన్న సమయంలో  వైద్య, ఆరోగ్య రంగంపై  రూ.8 వేల కోట్లు  ఖర్చు చేస్తే  తమ ప్రభుత్వం  రూ. 18 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు.  రాష్ట్రంలో  మరో  17 మెడికల్  కాలేజీలు నిర్మిస్తున్నామని సీఎం చెప్పారు. 
 

click me!