అందుకే విజయవాడ- అమరావతి రింగ్ రోడ్డు నిర్మాణం ఆలస్యం: గడ్కరీ

Published : Jun 24, 2019, 02:25 PM IST
అందుకే విజయవాడ- అమరావతి రింగ్ రోడ్డు నిర్మాణం ఆలస్యం: గడ్కరీ

సారాంశం

భూసేకరణలో ఆసల్యం వల్లే విజయవాడ- అమరావతి రింగ్ రోడ్డు నిర్మాణం ఆలస్యమైందని కేంద్ర రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు.  

న్యూఢిల్లీ: భూసేకరణలో ఆసల్యం వల్లే విజయవాడ- అమరావతి రింగ్ రోడ్డు నిర్మాణం ఆలస్యమైందని కేంద్ర రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు.

సోమవారం నాడు రాజ్యసభలో వైసీపీ ఎంపీ  విజయసాయి రెడ్డి వేసిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. విజయవాడ-  అమరావతి రింగ్ రోడ్డుతో పాటు ఇతర రోడ్ల నిర్మాణం గురించి విజయసాయిరెడ్డి  ప్రశ్నించారు.

అయితే భూసేకరణ వల్లే ఈ రోడ్డు నిర్మాణ పనులు ఆలస్యమైనట్టుగా ఆయన అభిప్రాయపడ్డారు.  రోడ్డు నిర్మాణాలకు సంబంధించిన అవలంభిస్తున్న పద్దతులను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. భూసేకరణ పూర్తి చేస్తే ఈ నిర్మాణాన్ని సకాలంలో పూర్తయ్యేదని గడ్కరీ చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Legendary Actor Krishnam Raju 86th Birth Anniversary | Free Mega Diabetes Camp | Asianet News Telugu
Tirupati: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. తిరుప‌తి ప‌రిస‌ర ప్రాంతాల సంద‌ర్శ‌న‌కు ప్ర‌త్యేక ప్యాకేజీలు