ఏపీలో మరోసారి రాత్రి పూట కర్ఫ్యూ పొడగింపు: జగన్ నిర్ణయం

By telugu team  |  First Published Aug 20, 2021, 1:10 PM IST

ఏపీలో రాత్రి పూట కర్ఫ్యూను పొడగిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం మరోసారి నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడికి విధిస్తున్న ఈ కర్ప్యూను వచ్చే నెల 4వ తేదీ వరకు అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.


అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాత్రి పూట కర్ఫ్యూను మరోసారి పొడగించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. కరోనా కట్టడికి రాత్రి పూట కర్ఫ్యూను కొనసాగించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 4వ తేదీ వరకు కర్ఫ్యూ ఆంక్షలు కొనసాగనున్నాయి. ప్రతి రోజు రాత్రి 11 గంటల నుంచి మర్నాడు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది.

ఏపీ వైద్య ఆరోగ్య శాఖ గురువారం అందించిన వివరాల ప్రకారం.... కరోనా కేసులు కాస్తా తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 1501 మందికి కరోనా వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. దాంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య రాష్ట్రంలో 19,98,603కు చేరుకంది. 

Latest Videos

రాష్ట్రంలో ఇప్పటి వరకు 19 లక్షల 69 వేల 169 మంది కోవిడ్ వ్యాధి నుంచి కోలుకున్నారు. ఇంకా 15,738 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం 2 కోట్ల 59 లక్షల 3 వేల 356 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కొత్తగా కరోనాతో 10 మంది మృత్యువాత పడ్డారు. 

కర్ఫ్యూ విధింపు వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని, కరోనా వైరస్ కట్టడి అవుతోందని జగన్ ప్రభుత్వం భావిస్తోంది. దీంతో నైట్ కర్ఫ్యూను పొడగిస్తూ మరోసారి నిర్ణయం తీసుకుంది. 

click me!