కూతుర్ని హీరోయిన్ చేయాలనుకుని బలవంతంగా హార్మోన్ ఇంజక్షన్లు.. ఈ కేసులో ఊహించని ట్విస్ట్..

Published : Jun 12, 2023, 02:05 AM IST
కూతుర్ని హీరోయిన్ చేయాలనుకుని బలవంతంగా హార్మోన్ ఇంజక్షన్లు.. ఈ కేసులో ఊహించని ట్విస్ట్..

సారాంశం

విజయనగరంలో ఓ తల్లి తన కూతురిని హీరోయిన్ చేయాలనుకుంది. అయితే కూతురికి వయస్సు చిన్నది. దీంతో దిగజారిన తల్లి కూతురి శరీర భాగాలు పెరిగేందుకు బలవంతంగా హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చిందనే ఆరోపణలు వచ్చాయి. అయితే.. ఈ కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది.   

కూతురిని హీరోయిన్ ను చేసేందుకు ఓ తల్లి బలవంతంగా హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చిందనే కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. మీడియా ముందుకు వచ్చిన నిందితురాలు (బాధితురాలి తల్లి) ఆనందకుమారి సంచలన ఆరోపణలు చేసింది. అభిషేక్, దేవరాజ్ అనే ఇద్దరు పాస్టర్లు తన కూతుర్ని రెచ్చగొట్టి.. తనపై తప్పుడు కేసు పెట్టించారని ఆమె ఆరోపించింది. తన కుమార్తెను లొంగదీసుకోవాలని వారు ఇలా తనపై అసత్య ఆరోపణలు చేశారని ఆనందకుమారి తెలిపారు. వారు తన కూతురిని ట్రాప్ చేశారని అన్నారు. వారు మాకు సాయం చేస్తున్నట్టు  నటించి.. తన కూతుర్ని వాడుకోవాలని చూశారని ఆరోపించింది.

అందుకు ఒప్పుకోనందుకు తన కూతురుని  పిచ్చిదాన్ని చేశారు. ఆమె బాగు చేస్తున్నట్టు నటించి.. శారీరకంగా, మానసికంగా హింసించారని ఆరోపించింది. ఈ విషయం గ్రహించి వారిపై  తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపింది.  ఆ కోపంతోనే తన కూతుర్ని ట్రాప్ చేశారని ,తనకు వ్యతిరేకంగా చైల్డ్ లైన్ అధికారులకు ఫిర్యాదు చేయించారని వాపోయింది. నా కుమార్తెకు తాను ఎలాంటి హార్మోన్ ఇంజెక్షన్లు ఇవ్వలేదనీ, ఎలాంటి వేధింపులకు గురి చేయాలేదని  ఆనందకుమారి స్పష్టం చేశారు.

అసలేం జరిగిందంటే..

విజయనగరంలోని తోటపాలం దగ్గరలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలో 40 ఏళ్ల ఒంటరి మహిళ తన కూతురితో కలిసి నివాసం ఉంటోంది. గతంలోనే ఆమె భర్త చనిపోయాడు. దీంతో ఆమె మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వారికి ఇద్దరు పిల్లలు పుట్టారు. అయితే.. ఆ మహిళ ప్రవర్తన నచ్చక.. రెండో భార్త తన ఇద్దరు పిల్లలను తీసుకొని ఆమెను వదిలి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో తన మొదటి భర్తతో కల్గిన 15 ఏళ్ల పాపతో కలిసి ఉంటుంది. అయితే.. తన కూతురిని హీరోయిన్ చేయాలని భావించింది ఆ తల్లి.. కానీ తన కూతురికి ఇంకా 15 ఏండ్లే. చాలా చిన్నది. సరైన వయసు రాలేదు. దాంతో ఆమె దిగజారిపోయింది. తన కూతురు త్వరగా ఎదగడానికి ఇంజెక్షన్లు,డ్రగ్ ఇంజెక్షన్లు ఇవ్వడం ప్రారంభించాడు. 

వాటి ప్రభావాన్ని తట్టుకోలేని ఆ బాలిక.. వద్దని ఎంత బతిమిలాడినా.. కూతురు బాధను పట్టించుకోకుండా ఇంజెక్షన్లు ఇస్తూనే పోయింది. సినిమాల్లోకి వెళ్తే.. మంచి భవిష్యత్తు ఉంటుందని.. కోట్లు సంపాదించొచ్చు అని ప్రలోభపెట్టేది. కానీ, బాలిక అందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆగ్రహించిన ఆ తల్లి.. తన  కూతురిని చిత్రహింసలు పెట్టింది. పలుమార్లు బాలికకు నిద్రమాత్రలు కూడా ఇచ్చింది.

ఈ క్రమంలో బాలిక ఆరోగ్యం దిగజారింది. తన బాధను ఎవరికి చెప్పాలో తెలియని ఆ బాలిక చైల్డ్ లైన్ 1098కు కాల్ చేసింది. తన తల్లి పెడుతున్న చిత్రహింసలను వివరించింది. వారి సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు బాలికను కసాయి తల్లి నుంచి విడిపించారు. అనంతరం ఆ బాలికను విశాఖపట్నంలోని స్వధార్ హోమ్ కు తరలించారు. ఈ దారుణమైన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో కసాయి తల్లిని అరెస్ట్ చేశారు. అయితే, తాజాగా.. తన కూతురికి తాను ఎలాంటి ఇంజెక్షన్లు ఇవ్వలేదని, దీనికి వెనుక ఇద్దరు పాస్టర్లు కుట్ర ఉందని బాలిక తల్లి చెప్పడం సంచలనంగా మారింది.

PREV
click me!

Recommended Stories

AP Minister Ramprasad Reddy Lays Foundation for ₹19 Crore Works in Vijayawada | Asianet News Telugu
APCPDCL హెడ్ఆఫీస్ప్రారంభంలోMinister Gottipati Ravi Kumar | APCPDCL Head Office | Asianet News Telugu