బెజవాడ యువతి హత్య కేసులో ట్విస్ట్: దివ్య, స్వామిల మధ్య ఏడేళ్ల ప్రేమ..?

Siva Kodati |  
Published : Oct 15, 2020, 04:13 PM IST
బెజవాడ యువతి హత్య కేసులో ట్విస్ట్: దివ్య, స్వామిల మధ్య ఏడేళ్ల ప్రేమ..?

సారాంశం

బెజవాడ యువతి దారుణ హత్య కేసు అనూహ్య మలుపు తిరిగింది. మృతురాలు దివ్య, నిందితుడు స్వామి ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నట్లుగా తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం వారిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు స్వామి సోదరుడు చెబుతున్నాడు. 

వీరిద్దరి పెళ్లి దివ్య కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని, పెళ్లి విషయం తెలిసిన తర్వాత ఆమెను గృహ నిర్బంధం చేసినట్లుగా సమాచారం. నిన్న స్వామితో దివ్య తండ్రి గొడవ పడినట్లుగా సమాచారం.

కొద్దిరోజుల క్రితం ఒక పెళ్లికి కూడా వారిద్దరూ హాజరైనట్లు స్వామి సోదరుడు చెబుతున్నాడు. ఇంతలోనే ఇలాంటి ఘటన జరుగుతుందని తాను ఊహించలేదని అతను వాపోయాడు.

ప్రస్తుతం స్వామి తీవ్ర గాయాలతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దివ్వను హత్య చేసిన తర్వాత స్వామి తనను తాను గాయపరచుకున్నాడు. అయితే స్వామి ఎవరో తమకు తెలియదంటున్నారు దివ్య తల్లిదండ్రులు.

కాగా, గురువారం విజయవాడలో ఇంజనీరింగ్ విద్యార్ధిని తేజస్విని ఇంటికి వెళ్లి స్వామి అనే యువకుడు కత్తితో ఆమె గొంతు కోశాడు. ఆమె తీవ్రంగా గాయపడింది. ఆ తర్వాత తనను తాను గాయపర్చుకొన్నాడు. 

PREV
click me!

Recommended Stories

అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu
YSRCP Mayor Candidate : నెల్లూరు మేయర్ అభ్యర్థిని ప్రకటించిన వైసిపి.. ఎవరీ విజయ్ కుమార్ రెడ్డి?