నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం...భార్యాభర్తల మృతి

Published : Nov 10, 2018, 04:15 PM ISTUpdated : Nov 10, 2018, 04:18 PM IST
నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం...భార్యాభర్తల మృతి

సారాంశం

నెల్లూరు జిల్లాలో ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.  ఈ  ప్రమాదంలో ఓ కారు నుజ్జునుజ్జవగా అందులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలు సంఘటనా స్థలంలోనే మృతిచెందారు.   

నెల్లూరు జిల్లాలో ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.  ఈ  ప్రమాదంలో ఓ కారు నుజ్జునుజ్జవగా అందులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలు సంఘటనా స్థలంలోనే మృతిచెందారు. 

నెల్లూరు జిల్లా స్టోన్ హౌస్ పేటకు చెందిన గ్రంధి నాగేశ్వరరావు(55), సులోచనమ్మలు తిరుపతికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వీరు ప్రయాణిస్తున్న కారు వేగంగా వెళుతూ పెళ్లకూరు మండలం గుర్రప్పతోట వద్ద అదుపుతప్పింది. దీంతో కారు ఒక్కసారిగా  అదుపు తప్పి రోడ్డుపక్కనున్న చెట్టును ఢీకొట్టింది. 

ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉంటుందని భావిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఒకేసారి భార్యభర్తలిద్దరు మృత్యువాత పడటంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు