తొక్కాలనుకుంటే ఈపాటికే.. : ఆనంపై నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Feb 18, 2022, 02:55 PM IST
తొక్కాలనుకుంటే ఈపాటికే.. : ఆనంపై నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

సారాంశం

నెల్లూరు జిల్లా విభజనకు సంబంధించి వైసీపీ నేత, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆనం వ్యాఖ్యలపై వైసీపీ నేత నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి (nedurumalli ramkumar reddy ) కౌంటరిచ్చారు. నేదురుమల్లి జనార్థన్ రెడ్డి లేకుంటే ఆనంకు రాజకీయ భవిష్యత్ లేదంటూ దుయ్యబట్టారు. 

నెల్లూరు జిల్లా విభజనకు సంబంధించి వైసీపీ నేత, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే.  తాజాగా ఆయన మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. విభజనతో సోమశిల ప్రాజెక్ట్ నీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తుతాయని ఆనం అన్నారు. జిల్లా విభజన సమయంలో నీటి లెక్కలు తేల్చాలని.. పాలనాపరమైన అంశాల్లోనూ ఇబ్బందులు తలెత్తుతాయని ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. 

డీలిమిటేషన్ విషయంలో హడావుడి నిర్ణయాలతో విద్వేషాలు పెరుగుతాయని.. విభజనపై అవగాహన సదస్సులు నిర్వహించాలి ఆనం డిమాండ్ చేశారు. ప్రజలు, ప్రజా ప్రతినిధుల అభిప్రాయం తీసుకోవాలని ఆయన కోరారు. ఈ క్రమంలో ఆనం వ్యాఖ్యలపై వైసీపీ నేత నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి (nedurumalli ramkumar reddy ) కౌంటరిచ్చారు. నేదురుమల్లి జనార్థన్ రెడ్డి లేకుంటే ఆనంకు రాజకీయ భవిష్యత్ లేదంటూ దుయ్యబట్టారు. బాలాజీ జిల్లాకి వెంకటగిరి ప్రజలు వ్యతిరేకంగా లేరని.. ఎమ్మెల్యేగా రాపూర్‌కి ఆనం ఏం చేశారో చెప్పాలని  రాంకుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆనం ఫ్యామిలీని తొక్కాలనుకుంటే.. జనార్థన్ రెడ్డి ఎప్పుడో పక్కన పెట్టేవారని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

అంతకుముందు బుధవారం నాడు మాజీ మంత్రి Anam Ramana Narayana Reddy నెల్లూరు జిల్లాలో మీడియాతో మాట్లాడారు. వెంకటగిరి నియోజకవర్గంలోని సైదాపురం, కలువాయి, రాపూరు మండలాలను నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని వైసీపీ నేతలు డిమాండ్  చేస్తున్నారు. జిల్లా విభజనలో Venkatagiriకి అన్యాయం జరిగిందన్నారు. డిలిమిటేషన్, రాష్ట్ర విభజన సమయాల్లో ప్రజలు నష్టపోయారన్నారు. మళ్లీ నష్టపోవడానికి సిద్ధంగా  ప్రజలు సిద్దంగా లేరన్నారు. నాగార్జున సాగర్ డ్యామ్‌పై రెండు రాష్ట్రాల  పోలీసుల మధ్య జరుగుతున్న దాడుల మాదిరిగా Nellore-Balaji జిల్లాల పోలీసులకు సమస్యలు వచ్చే అవకాశముందన్నారు. శాస్త్రబద్ధంగా నీళ్లు, నిధుల గురించి చట్టపరంగా ఆలోచించి జిల్లాల విభజన చేస్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాంటి అశాస్త్రీయ విధానం బాధ కలిగిస్తోందని ఆనం రామనారాయణరెడ్డి అన్నారు.

కొత్త జిల్లాల ఏర్పాటు విషయమై ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఆందోళనలు సాగుతున్నాయి. YCPకి చెందిన ప్రజా ప్రతినిధులు ప్రస్తుతం ఈ విషయమై వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. జిల్లాలకు పేర్లు పెట్టే విషయంతో పాటు జిల్లాల కేంద్రాలు ఏర్పాటు తదితర అంశాలపై కూడా ఆందోళనలు సాగుతున్నాయి. అయితే మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. గతంలో కూడా ఆనం రామనారాయణరెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత సీఎం జగన్ తో భేటీ అయిన తర్వాత అసెంబ్లీ ఆనం రామనారాయణరెడ్డి టీడీపీపై విమర్శలు గుప్పించారు. కానీ ఆ తర్వాత ఆనం రామనారాయణ రెడ్డి ఎలాంటి సంచలన వ్యాఖ్యలు చేయలేదు. కానీ ఇవాళ మాత్రం మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ నాయకత్వం ఏం చేస్తోందోననేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

కొత్త జిల్లాలపై వచ్చే అన్ని రకాల అభ్యంతరాలు, సూచనలను  క్షుణ్ణంగా పరిశీలించి, అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటుచేసింది. ప్రణాళిక శాఖ కార్యదర్శి, సీసీఎల్‌ఏ కార్యదర్శి, అన్ని జిల్లాల కలెక్టర్లతో ఈ కమిటీని ఏర్పాటుచేశారు.  కొత్త జిల్లాలకు సంబంధించి అభ్యంతరాలు, సూచనలను జిల్లా కలెక్టర్లకు ఇచ్చేందుకు సర్కారు 30 రోజుల గడువు ఇచ్చింది. ఆయా జిల్లాల్లో కలెక్టర్లు వీటిని స్వీకరిస్తున్నారు. తాము అందుకున్న విజ్ఞప్తులను కలెక్టర్లు www. drp.ap.gov.in వెబ్‌ సైట్‌లో ప్రతీరోజూ అప్‌లోడ్‌ చేయాల్సి వుంటుంది. ఇలా అప్‌లోడ్‌ చేసే ప్రతి అభ్యంతరం, సూచనను పరిశీలించి దానిపై రిమార్కు రాయాలి.

ఆ తర్వాత వాటిని కలెక్టర్లు, రాష్ట్రస్థాయి అధికారుల కమిటీ పరిశీలిస్తుంది. వచ్చిన అభ్యంతరాలు, సలహాలను ఈ కమిటీ పూర్తిగా అధ్యయనం చేసి అది సహేతుకమైనదా? పరిగణలోకి తీసుకోవాలా లేదా? అని నిర్ణయం తీసుకుంటుంది. ప్రతి అభ్యంతరం, పరిశీలనను స్వీకరించాలా? తిరస్కరించాలో? చెబుతూ ఈ కమిటీ సిఫారసు చేస్తుంది. ఈ సిఫార్సుల ఆధారంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఏమైనా మార్పులు, చేర్పులు చేయాల్సి వుంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తుది నిర్ణయం తీసుకోనుంది.

PREV
click me!

Recommended Stories

Nimmala Rama Naidu Pressmeet: ఉగ్రవాదులకంటే ఉన్మాదం జగన్ పై రెచ్చిపోయిన నిమ్మల | Asianet News Telugu
Thalassemia Run 2026: ఆ రోజు ఆ తల్లి, బిడ్డని చూసి..నారా భువనేశ్వరి ఎమోషనల్ | Asianet News Telugu