కరోనా నియంత్రణలోనే కాదు ఇప్పటికే కరోనా బారిన పడిన వారికి చికిత్స అందించడంలోనూ వైసిపి ప్రభుత్వం విఫలమయ్యిందని నారా లోకేష్ ఆరోపించారు.
గుంటూరు: కరోనా మహమ్మారిని ఆంధ్ర ప్రదేశ్ లో రోజురోజుకు మరింత ప్రమాదకరంగా మారుతోందని... అయినా కూడా జగన్ ప్రభుత్వం అదే నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. కరోనా నియంత్రణలోనే కాదు ఇప్పటికే కరోనా బారిన పడిన వారికి చికిత్స అందించడంలోనూ ఈ ప్రభుత్వం విఫలమయ్యిందని నారా లోకేష్ ఆరోపించారు.
రెండు రోజుల క్రితం కరోనా సోకిన ఓ కుటుంబంమొత్తం వైద్యం కోసం ఎదురుచూస్తున్న విషయాన్ని లోకేష్ ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చాడు. సదరు బాధిత కుటుంబం ఆవేదనతో తమను కాపాడాలంటూ వేడుకుంటున్న వీడియోను జతచేస్తూ లోకేష్ ట్వీట్ చేశారు.
undefined
''టెస్టింగ్ నుండి ట్రీట్మెంట్ వరకూ అన్నీ అబద్దాలే. కరోనా పెద్ద విషయం కాదన్న రోజునుండి అదే నిర్లక్ష్య ధోరణి. అనంతపురం, అశోక్ నగర్ కి చెందిన భవాని శంకర్ కుటుంబంలో 5గురికి కరోనా పాజిటివ్ అని చెప్పి ఇంటికి పంపారు''
టెస్టింగ్ నుండి ట్రీట్మెంట్ వరకూ అన్నీ అబద్దాలే. కరోనా పెద్ద విషయం కాదన్న రోజునుండి అదే నిర్లక్ష్య ధోరణి. అనంతపురం, అశోక్ నగర్ కి చెందిన భవాని శంకర్ కుటుంబంలో 5గురికి కరోనా పాజిటివ్ అని చెప్పి ఇంటికి పంపారు.(1/2) pic.twitter.com/q2ntP0VzmJ
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh)
''వస్తుందన్న అంబులెన్స్ అడ్రెస్ లేదు, పట్టించుకున్న నాధుడు లేడు. రెండు రోజులుగా కుటుంబం పడుతున్న ఆవేదన వర్ణణాతీతం. ప్రజలకి ఆసుపత్రుల్లో బెడ్స్ లేవంటూ గాలికొదిలేస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం అధికార పార్టీ ఎమ్మెల్యేలకు,నాయకులకు హైదరాబాద్ లో అధునాతన వైద్యం అందిస్తోంది'' అంటూ బాధిత కుటుంబ బాధను తెలియజేస్తూనే ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ ట్వీట్ చేశారు నారా లోకేష్.