అక్రమ సంబంధానికి గోత్రాలతో పనేంటి..కేసీఆర్ పై లోకేష్ సెటైర్

By rajesh yFirst Published Sep 7, 2018, 6:16 PM IST
Highlights

తెలంగాణ ముందస్తు ఎన్నికలపై ఏపీ మంత్రి నారా లోకేష్ అసహనం వ్యక్తం చేశారు. ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లారో కేసీఆర్ ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏర్పడిన తొలి ప్రభుత్వం ముందే రద్దవ్వడం బాధేసిందన్నారు. రైతు బంధు పథకంతో కౌలు రైతుకు ఏమాత్రం లబ్ధి చేకూరలేదని లోకే ష్ అభిప్రాయపడ్డారు.  
 

అమరావతి: తెలంగాణ ముందస్తు ఎన్నికలపై ఏపీ మంత్రి నారా లోకేష్ అసహనం వ్యక్తం చేశారు. ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లారో కేసీఆర్ ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏర్పడిన తొలి ప్రభుత్వం ముందే రద్దవ్వడం బాధేసిందన్నారు. రైతు బంధు పథకంతో కౌలు రైతుకు ఏమాత్రం లబ్ధి చేకూరలేదని లోకే ష్ అభిప్రాయపడ్డారు.  

బీజేపీతో కలవమని కేసీఆర్ చెప్తున్నారు కానీ బీజేపీ స్క్రిప్ట్ ప్రకారమే కేసీఆర్ నడుస్తున్నట్లుందని నారా లోకేష్ ఆరోపించారు. అక్రమ సంబంధానికి గోత్రాలతో పనేంటంటూ ఘటుగా విమర్శించారు. ప్రిపోల్ అలయన్స్ పెట్టుకున్న టీడీపీకి, ఏపీకి ఏం చెయ్యని కేంద్రప్రభుత్వం టీఆర్ఎస్ కు ఎంతో సహకరించిందని స్పష్టం చేశారు. జోనల్ వ్యవస్థకు మూడు రోజుల్లో గెజిట్ ఇచ్చారని గుర్తు చేశారు. 

మరోవైపు ప్రత్యేక హోదా విషయంలో ఏపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ కేంద్రానికి సహకరించిందంటూ లోకేష్ ఆరోపించారు. తమ ఎమ్మెల్యే ఇతనే అని ప్రజలు గుర్తు చేసుకోవడం తప్ప టీఆర్ఎస్ ప్రచారంతో ఒరిగిందేమీ లేదని లోకేష్ అభిప్రాయపడ్డారు. ముందస్తు ఎన్నికలకు వెళ్తే కేసీఆర్ ఏం చెప్పుకుంటారని ప్రశ్నించారు. అటు అవినీతిపరుల ఆస్తులను జప్తు చెయ్యాలన్న బిల్లును కేంద్రానికి పంపితే మోక్షం లేదన్నారు. అవినీతి పరుడైన జగన్ కు కేంద్రప్రభుత్వం సహకరిస్తోందంటూ లోకేష్ ఆరోపించారు.  
 

click me!