Nara Chandrababu Naidu..దుష్టులను శిక్షించాలని కోరుకున్నా: కనకదుర్గమ్మను దర్శించుకున్న బాబు

Published : Dec 02, 2023, 01:44 PM ISTUpdated : Dec 02, 2023, 03:58 PM IST
 Nara Chandrababu Naidu..దుష్టులను శిక్షించాలని కోరుకున్నా: కనకదుర్గమ్మను దర్శించుకున్న బాబు

సారాంశం

విజయవాడ ఇంద్రీకీలాద్రి  కనకదుర్గమ్మ ఆలయంలో  తెలుగుదేశం పార్టీ అధినేత  చంద్రబాబునాయుడు  దంపతులు  ప్రత్యేక పూజలు నిర్వహించారు.   

విజయవాడ:నగరంలోని ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారిని తెలుగుదేశం పార్టీ అధినేత  చంద్రబాబు దంపతులు  శనివారంనాడు  దర్శించుకున్నారు.  ఇవాళ  ఉదయం తన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి చంద్రబాబు నాయుడు  నారా భువనేశ్వరిని దర్శించుకున్నారు.నిన్న తిరుమల శ్రీవారిని చంద్రబాబు నాయుడు దంపతులు దర్శించుకున్నారు. తిరుమల వెంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల నుండి నేరుగా అమరావతికి చేరుకున్నారు.  నిన్న రాత్రి తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో  చంద్రబాబు నాయుడు  పాల్గొన్నారు .

శనివారంనాడు ఉదయం  విజయవాడ కనకదుర్గ అమ్మవారిని చంద్రబాబు దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆయన  మీడియాతో మాట్లాడారు. 
దుష్టులను శిక్షించాలని అమ్మవారిని కోరుకున్నట్టుగా  ఆయన  చెప్పారు. తాను కష్టకాలంలో ఉన్న సమయంలో  అందరూ  తన కోసం  ప్రార్థించారన్నారు. న్యాయం,ధర్మం కోసం పోరాటం చేశారన్నారు. తాను  కష్టంలో ఉన్నప్పుడు తన కోసం ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్లంతా పోరాటం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. విశాఖపట్టణంలోని సింహాచలం అప్పన్నను, శ్రీశైలం మల్లికార్జునస్వామిని కూడ  చంద్రబాబు దంపతులు దర్శించుకోనున్నారు.  

also read:Nara Chandrababu Naidu:తిరుమల వెంకన్నను దర్శించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబునాయుడిని  ఈ ఏడాది సెప్టెంబర్  9వ తేదీన  ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.ఈ కేసులో చంద్రబాబుకు  ఈ ఏడాది అక్టోబర్  31న  ఆంధ్రప్రదేశ్ హైకోర్టు  మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.  ఈ ఏడాది నవంబర్  20న  ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడాన్ని  ఏపీ సీఐడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్ పై విచారణను  ఈ నెల  8వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. చంద్రబాబు నాయుడు పార్టీ సమావేశాల్లో పాల్గొనకుండా షరతులు విధించాలని  సీఐడీ అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.  దీంతో  చంద్రబాబు నాయుడు  నిన్న టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొన్నారు. 

 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu: నారావారిపల్లెలో అభివృద్ధిపనులు ప్రారంభించిన సీఎం| Asianet News Telugu
Bhumana Karunakar Reddy: కోనసీమ జిల్లాలో బ్లోఔట్ పై భూమన సంచలన కామెంట్స్ | Asianet News Telugu