
ఆనపర్తి: తూర్పుగోదావరి జిల్లా ఆనపర్తి బిక్కవోలులోని గోలింగేస్వారస్వామి ఆలయంలో నంది విగ్రహం మాయమైంది. ఈ ఘటనపై ఆలయ కమిటీ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.గుర్తు తెలియని దుండగులు నంది విగ్రహన్ని తీసుకెళ్లారని స్థానిక భక్తులు అనుమానిస్తున్నారు.గత నెల 26వ తేదీన నంది విగ్రహం మాయమైందని ఆలయ అధికారులు అనుమానిస్తున్నారు. ఆలయ అధికారులు ఇంత ఆలస్యంగా పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేశారనే విషయమై భక్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
చోళ రాజుల కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. 600 ఏళ్ల క్రితమే ఈ ఆలయం నిర్మించారని స్థానికులు చెబుతున్నారు. ఎంతో ప్రసిద్దిగాంచిన ఆలయంలో నంది విగ్రహం ఎలా మాయమైందని భక్తులు ప్రశ్నిస్తున్నారు.ఈవో ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.గతంలో కూడ ఏపీ రాష్ట్రంలోని పలు దేవాలయాల్లో విగ్రహలు ధ్వసం చేయడమో లేదా విగ్రహలు చోరీకి గురికావడమో జరిగింది.ఈ విషయమై ఏపీలో విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళనలు సాగించాయి.దేవాలయాల్లో దాడులు, విగ్రహల చోరీలు, ధ్వంసం వంటి వాటి వెనుక రాజకీయపార్టీలున్నాయని గతంలో ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ ప్రకటించారు. డీజీపీ వ్యాఖ్యలపై విపక్షాలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే