బాలికపై నెలలుగా అత్యాచారం..నిప్పంటించిన కామాంధుడు

sivanagaprasad kodati |  
Published : Jan 27, 2019, 10:43 AM IST
బాలికపై నెలలుగా అత్యాచారం..నిప్పంటించిన కామాంధుడు

సారాంశం

కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. కౌతాలం మండలం బదినేహల్‌లో ఓ వ్యక్తి మైనర్‌బాలిక ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన మౌలాల్ సాబ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు.

ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ బాలికపై మౌలాల్ పెట్రోల్ పోసి హత్యాయత్నం చేశాడు. ఆమె కేకలు, అరుపులు విన్న చుట్టుపక్కల వారు అక్కడికి వచ్చి మంటలను ఆర్పారు. అయితే అప్పటికే ఆమె శరీరం 70 శాతం కాలిపోయింది..బాలికను ఆస్పత్రికి తరలించిన గ్రామస్తులు, పోలీసులకు సమాచారం అందించారు. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. 
 
PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్