టీడీపీ నమ్మకం మొత్తం నిమ్మగడ్డ మీదే.. విజయసాయి సెటైర్లు

Published : Jun 01, 2020, 10:45 AM IST
టీడీపీ నమ్మకం మొత్తం నిమ్మగడ్డ మీదే.. విజయసాయి సెటైర్లు

సారాంశం

మరో ట్వీట్‌లో.. 'నిన్న యనమల స్టేట్‌మెంట్‌తో ఒక విషయం వందోసారి స్పష్టమైంది. టీడీపీకి ప్రజాస్వామ్యం, ప్రజల మీద ఏమాత్రం నమ్మకం లేదు. ఉన్న నమ్మకాలన్నీ నిమ్మగడ్డ మీదే' అంటూ విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో విమర్శలు చేశారు. 'పోతిరెడ్డిపాడు పనులు నిలిపివేయాలని గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశిస్తే ఒక్క మాట మాట్లాడలేదు. ప్రభుత్వం కంటే ముందే తమ పార్టీ కోర్టుకెళ్తుందని బాబు అని ఉంటే ప్రజల పట్ల అంతో ఇంతో బాధ్యత ఉందని అనిపించేది. పట్టించుకోనవసరం లేని వ్యక్తుల కోసం న్యాయ పోరాటాలు చేసి పరువు తీసుకుంటున్నాడు' అంటూ ట్వీట్‌ చేశారు.

కాగా మరో ట్వీట్‌లో.. 'నిన్న యనమల స్టేట్‌మెంట్‌తో ఒక విషయం వందోసారి స్పష్టమైంది. టీడీపీకి ప్రజాస్వామ్యం, ప్రజల మీద ఏమాత్రం నమ్మకం లేదు. ఉన్న నమ్మకాలన్నీ నిమ్మగడ్డ మీదే' అంటూ విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. కాగా.. టీడీపీ నేతలపై, చంద్రబాబుపై విజయసాయి రెడ్డి విమర్శలు చేయడం ఇదేమీ తొలిసారి కాదు. ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తూనే ఉంటారు.

ఇదిలా ఉండగా.. ఇటీవల వైసీపీ గత ఎన్నికల్లో విజయం సాధించి సంవత్సరం పూర్తైన సందర్భంగా కూడా విజయసాయి ట్విట్టర్ లో స్పందించారు. జగన్ పై ప్రశంసలు కురిపిస్తూ.. చంద్రబాబుపై విమర్శలు చేశారు.

"ఏడాది క్రితం ఇదే రోజు, ‘ఫ్యాన్’ ప్రభంజనాన్ని దేశమంతా కళ్లార్పకుండా చూసింది. ఏకపక్ష విజయంతో చరిత్రను తిరగరాశారు జననేత జగన్ గారు. తన వెంట నడిచిన ప్రజల కోసం ‘పది తలల విషనాగు’తో పోరాడారాయన. వ్యవస్థల్ని భ్రష్టుపట్టించి, వేల కోట్లు వెదజల్లిన పచ్చ పార్టీని పాతాళానికి తొక్కారు." అని ట్వీట్ చేసారు. 

 

మరో ట్వీట్లో... 9 సంవత్సరాలపాటు జగన్ ని ఎన్నివిధాలుగా ఇబ్బందులకు గురిచేసారో చెప్పుకొస్తూ... జగన్ ని అభిమన్యుడిలా ఒంటరివాడిని చేసి మట్టుపెట్టాలని చూసినా, జగన్ గుండె ధైర్యం ముందు వారు నిలవలేకపోయారని ఆయన వ్యాఖ్యానించారు. "తొమ్మిదేళ్ల పాటు ఎన్నెన్ని కుట్రలు. జైలుకు పంపడం. అభిమన్యుడిలా ఒంటిరివాడిని చేసి మట్టుపెట్టాలని చూశారు. కర్ణుడిలా అశక్తుడిని చేసి హతమార్చాలని స్కెచ్చులు వేశారు. ఆ గుండె ధైర్యం, పట్టుదలల ముందు ప్రత్యర్థులు తోక ముడవక తప్పలేదు. ప్రజలకు జీవితకాల భరోసాగా నిల్చాడు యువనేత." అని ఆయన రాసుకొచ్చారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ కంటే హైదరాబాద్ లోనే లోయెస్ట్ టెంపరేచర్స్ .. స్కూల్ టైమింగ్స్ చేంజ్
YS Jagan Sensational Comments: మేము అధికారంలోకి వస్తే వాళ్లందరూ జైలుకే | Asianet News Telugu