చంద్రబాబు శాపాలు... విజయసాయి కౌంటర్లు

Published : Jul 05, 2019, 12:37 PM IST
చంద్రబాబు శాపాలు... విజయసాయి కౌంటర్లు

సారాంశం

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు పెట్టే పిల్లి శాపాలకు ఉట్లు కూడా తెగవని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు.

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు పెట్టే పిల్లి శాపాలకు ఉట్లు కూడా తెగవని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ఇటీవల అధికార ప్రభుత్వమైన వైసీపీకి చేసిన పాపాలే శాపాలుగా తగులుతాయంటూ చంద్రబాబు కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. కాగా... దీనిపై ట్విట్టర్ వేదికగా విజయసాయి స్పందించారు.

‘‘చంద్రబాబు గారూ పిల్లి శాపాలకు ఉట్లు తెగవు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం అసాధ్యమట. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయడం వీలు కాదంట. తన వల్ల కాని పనులను ఇంకెవరూ చేయలేరన్నట్ట సెలవిచ్చారు. అన్నమాట ప్రకారం జగన్ గారు చేసి చూపిస్తారు. మీరూ చూస్తారు.’’ అంటూ విజయసాయి కౌంటర్ ఇచ్చారు.

‘‘చంద్రబాబు గారేమో ఆకాశమంట, లోకేశేమో మిరుమిట్లు గొలిపే నక్షత్రమంట. ఆకాశంపై ఉమ్మేయొద్దని సలహా ఇస్తున్నాడు. అందనంత స్థాయి అని మీకు మీరే  పొగుడుకుంటున్నారా మందలగిరి మారాజా?’’ అంటూ లోకేష్ ని ఉద్దేశించి మరో కౌంటర్ ఇచ్చారు.

‘‘లింగమనేని గెస్ట్‌హౌస్‌ను ల్యాండ్‌పూలింగ్‌లో సేకరించి ప్రభుత్వ అతిథి గృహంగా మార్చినట్టు మార్చి 6, 2016 న చంద్రబాబు ప్రకటించారు. రికార్డుల్లో మాత్రం అది ఇప్పటికీ లింగమనేని పేరనే ఉంది. తర్వాత దాని రెనోవేషన్ కోసం 8 కోట్లు ఖర్చుపెట్టారు. ఇంతకీ అది ఎవరిదో చంద్రబాబు గారే చెప్పాలి?’’ అని మరో ట్వీట్ లో పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

Lokesh Motivate Speech: బ్రాహ్మణి అర్థం చేసుకుంటేనే నేను రోడ్లమీద తిరుగుతున్నా | Asianet News Telugu
Minister Nara Lokesh Speech: బాలయ్య డైలాగులతో రెచ్చిపోయిన నారాలోకేష్. ఇక సమరమే | Asianet News Telugu