‘‘ప్రజా వేదిక కూల్చివేత.. చంద్రబాబే జవాబుదారీ’’

Published : Jul 01, 2019, 11:57 AM IST
‘‘ప్రజా వేదిక కూల్చివేత.. చంద్రబాబే జవాబుదారీ’’

సారాంశం

అక్రమంగా కృష్ణా నదీ కరకట్ట వద్ద నిర్మించారనే కారణంతో ప్రజా వేదికను జగన్ ప్రభుత్వం కూల్చివేసిన సంగతి తెలిసిందే. 


అక్రమంగా కృష్ణా నదీ కరకట్ట వద్ద నిర్మించారనే కారణంతో ప్రజా వేదికను జగన్ ప్రభుత్వం కూల్చివేసిన సంగతి తెలిసిందే. కాగా... ప్రజా వేదిక కోసం ప్రజా ధనాన్ని ఖర్చు పెట్టారు కాబట్టి... దానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబే జవాబుదారిగా ఉండాలని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.  ఆయన ట్విట్టర్ వేదికగా చంద్రబాబు, లోకేష్ లపై విమర్శల వర్షం కురిపించారు.

‘‘ఆ రేకుల షెడ్డు ఒక హాస్పిటలో, బస్టాండో అయినట్టు బాబు గారి డ్రామా ఆర్టిస్టులు టీవీల ముందు ఆవేశపూరిత డైలాగులేస్తున్నారు. కిరాయి తీసుకున్నామనే సంగతి పక్కకు పెట్టి దానికి రూ.9 కోట్లు పెట్టారంటే ఎలా నమ్మాలయ్యా అని చంద్రబాబును ప్రశ్నించండి. ప్రజాధనానికి జవాబు చెప్పాల్సింది ఆయనే.’’ అని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.

‘‘రాజకీయ నేతలెవరైనా గెలిచినా, ఓడినా ప్రజల మధ్యన ఉండాలనుకుంటారు. చంద్రబాబు మాత్రం కాలు బయట పెట్టడానికి జంకుతున్నారు. ప్రజలిచ్చిన దిమ్మతిరిగే షాక్ నుంచి తేరుకోలేదో, లేక వాళ్ల మీద అలిగారో? లింగమనేని ఎస్టేట్ ఉంటుందో పోతుందో అన్న కొత్త టెన్షన్ మొదలైనట్లుంది ఆయనకు.’’ అంటూ సెటైర్లు వేశారు.

‘‘ప్రజావేదిక అనే రేకుల షెడ్డును హెరిటేజ్ కంపెనీ డబ్బుతో ఏమైనా కట్టారా లోకేశ్. మీరు, మీ ముఠా సభ్యులు తెగ ఆవేశ పడుతున్నారు. రూ.50 లక్షల విలువ చేయని తాత్కాలిక నిర్మాణానికి రూ.9 కోట్లు దోచుకు తిన్నది బయట పడిందనా ఏడుపులు? కిరాయి మనుషులతో పరామర్శలు, విషాద ఆలాపనలు ఏందయ్యా?’’అని కౌంటర్లు ఇచ్చారు.

‘‘ఎవరు సలహో ఇచ్చారో కాని తనను ఓదార్చేందుకు రోజుకు 300 మందిని రప్పించుకుంటున్నారు బాబు. వచ్చిన వాళ్లు బాగా రిహార్సల్ చేసి యాక్షన్ ఇరగదీస్తున్నారు. దేశంలోనే సంపన్నుడైన రాజకీయ నేతను, ఇల్లు లేకపోతే మా ఇంటి కొచ్చి ఉండండయ్యా అనడం డ్రామా కాకపోతే మరేమిటి?’’ అని ఎద్దేవా చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

చంద్రబాబుపై శివరాజ్ సింగ్ పొగడ్తలు | Shivraj Singh Speech | Asianet Telugu
బుర్రిపాలెంని ఉర్రుతలూగించిన బాబు ఉరమాస్ స్పీచ్ | Chandrababu Buripalem Speech | Asianet Telugu