జగన్ లేఖ వల్ల ఉపయోగం లేదు.. ఉండవల్లి షాకింగ్ కామెంట్స్

Published : Feb 08, 2021, 01:09 PM ISTUpdated : Feb 08, 2021, 01:12 PM IST
జగన్ లేఖ వల్ల ఉపయోగం లేదు.. ఉండవల్లి షాకింగ్ కామెంట్స్

సారాంశం

వైసీపీ ఎంపీలంతా బడ్జెట్ బాగోలేదని పెదవి విరిస్తే.. సీఎం మాత్రం బడ్జెట్‌ చాలా బాగుందంటూ అభినందిస్తూ రాయడంలో ఆంతర్యం ఏంటో తెలియడం లేదన్నారు.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంపై రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్ల అరుణ్ కుమార్ తాజాగా స్పందించారు. ఈ విషయంపై ఈరోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. పలు సంచలన కామెంట్స్ చేశారు. ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోవాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదన్నారు.

 ఆ లెటర్‌ను తీసి పక్కన పెడతారని కుండబద్దలు కొట్టారు. సీఎం జగన్ రాసిన లేఖలో మొదటి లైనే తనను ఆశ్చర్యపరిచిందన్నారు. వైసీపీ ఎంపీలంతా బడ్జెట్ బాగోలేదని పెదవి విరిస్తే.. సీఎం మాత్రం బడ్జెట్‌ చాలా బాగుందంటూ అభినందిస్తూ రాయడంలో ఆంతర్యం ఏంటో తెలియడం లేదన్నారు. స్టీల్ ప్లాంట్ గురించి క్లియర్‌గా చెప్పాల్సింది పోయి.. బడ్జెట్ ప్రస్తావన తీసుకు వచ్చారన్నారు.

 ఆ లేఖ వల్ల పెద్ద ప్రభావం ఉండదన్నారు. అన్ని పార్టీలు కలిసి చర్చించి, గనులు సాధించాలన్నదే తక్షణ కర్తవ్యమన్నారు. దీనిపై చర్చించడానికి సోము వీర్రాజు, నాదెండ్ల, సీపీఐ మధు, సీపీఎం రామకృష్ణ వస్తా అన్నారని, చంద్రబాబు, సీఎం జగన్ కార్యాలయాలకు ఫోన్ చేశానని తెలిపారు. అధికార, ప్రతిపక్షాల తీరును చూశాక... ఇదంతా వృథా అనిపిస్తోందన్నారు. స్టీల్ ప్లాంట్ ఇవ్వడం కరెక్ట్ కాదని... ప్రజల సెంటిమెంట్‌తో ముడిపడి ఉందన్నారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్