మళ్లీ మొదలుపెట్టిన కేశినేని, పీవీపీ ట్వీట్ వార్

By telugu teamFirst Published Jul 27, 2019, 12:40 PM IST
Highlights

 విజయవాడలో కేశినేని ట్రావెల్స్ కి చెందిన మాజీ ఉద్యోగులు చేసిన ధర్నాకు సీసీఐ నేతలు మద్దతు పలికిన విషయం తెలిసిందే. మూడేళ్లుగా తమకు జీతాలు ఇవ్వడం లేదని మాజీ  ఉద్యోగులు ధర్నా చేయగా.. కమ్యూనిస్టు నేతలు వారితోపాటు ఆందోళన చేశారు. ఈ ధర్నాపై కేశినేని సోషల్ మీడియాలో స్పందించారు.


టీడీపీ ఎంపీ కేశినేని నాని, వైసీపీ నేత పీవీపీల మధ్య ట్వీట్ వార్ మరోసారి మొదలైంది. ఇప్పటికే ఈ ఇద్దరు నేతలు పలుమార్లు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు. తాజాగా శనివారం కేశినేని చేసిన ఓ ట్వీట్ కి పీవీపీ చాలా వెరైటీ గా స్పందించారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... విజయవాడలో కేశినేని ట్రావెల్స్ కి చెందిన మాజీ ఉద్యోగులు చేసిన ధర్నాకు సీసీఐ నేతలు మద్దతు పలికిన విషయం తెలిసిందే. మూడేళ్లుగా తమకు జీతాలు ఇవ్వడం లేదని మాజీ  ఉద్యోగులు ధర్నా చేయగా.. కమ్యూనిస్టు నేతలు వారితోపాటు ఆందోళన చేశారు. ఈ ధర్నాపై కేశినేని సోషల్ మీడియాలో స్పందించారు. కమ్యూనిస్టు పార్టీల తీరు పట్ల కేశినేని అసహనం వ్యక్తం చేయగా... ఆ ట్వీట్ కి పీవీపీ ఘాటైన వ్యాఖ్యలతో రిప్లై ఇచ్చారు.

‘ఎంతో ఘన చరిత్ర ఉన్న కమ్యూనిస్టు పార్టీలు కిరాయి పార్టీలుగా మారిపోవడం వల్లనే ఈ రోజు దేశంలో కమ్యూనిస్టు పార్టీలు కనుమరుగు అయ్యే పరిస్థితి దాపురించింది.’’ అంటూ కేశినేని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కి పీవీపీ కౌంటర్ ఇచ్చారు. తాను కూడా ఇదే విషయం గురించి బాధపడుతున్నానని చెప్పారు. పండింట్ నెహ్రూ లాంటి యోధాను యోధులను ఢీ కొట్టిన ఎర్ర సోదరులు, ఎంతో ఘనమైన దోపిడీ చరిత్ర కలిగిన కోన్ కిస్కాగాడితో యుద్ధం చేయాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. కాగా... పీవీపీ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతోంది.
 

click me!