మళ్లీ డుమ్మాకొట్టిన అశోక్ గజపతిరాజు : అలకవీడలేదా....

Published : Feb 25, 2019, 07:03 AM IST
మళ్లీ డుమ్మాకొట్టిన అశోక్ గజపతిరాజు : అలకవీడలేదా....

సారాంశం

అంతేకాదు ఢిల్లీలో చంద్రబాబు కిషోర్ చంద్రదేవ్ తో భేటీ కావడంపై తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని అలిగారని తనను కనీసం సంప్రదించకపోవడంతో ఆయన ఆ రెండు సమావేశాలకు డుమ్మాకొట్టారంటూ ప్రచారం జరిగింది. అయితే అవన్నీ వట్టి పుకార్లేనని తాను అలగాల్సిన అవసరం లేదన్నారు.

విజయనగరం: ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కుగా ఉంటూ తెలుగుదేశం పార్టీలో నెంబర్ 2 స్థానంలో ఉన్న కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతిరాజు అలకవీడలేదా..? ఇప్పటికే రెండు కార్యక్రమాలకు డుమ్మా కొట్టిన అశోక్ గజపతిరాజు ఆదివారం జరిగిన మరో కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. 

సరిగ్గా వారం రోజుల క్రితం జరిగిన తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశానికి డుమ్మాకొట్టారు అశోక్ గజపతిరాజు. అంతకు ముందే అశోక్ గజపతిరాజు సొంత నియోజకవర్గమైన విజయనగరం జిల్లాలో భోగాపురం ఎయిర్ పోర్ట్ శంకుస్థాపన కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. 

ఇలా రెండు కీలక కార్యక్రమాలకు అశోక్ గజపతిరాజు డుమ్మా కొట్టడంపై  అలకబూనారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇదిలా ఉంటే కేంద్రమాజీమంత్రి వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ ను చంద్రబాబు తెలుగుదేశం పార్టీలో చేర్చుకునే అంశంపై అసలు చర్చించలేదని తెలుస్తోంది. 

అంతేకాదు ఢిల్లీలో చంద్రబాబు కిషోర్ చంద్రదేవ్ తో భేటీ కావడంపై తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని అలిగారని తనను కనీసం సంప్రదించకపోవడంతో ఆయన ఆ రెండు సమావేశాలకు డుమ్మాకొట్టారంటూ ప్రచారం జరిగింది. అయితే అవన్నీ వట్టి పుకార్లేనని తాను అలగాల్సిన అవసరం లేదన్నారు. 

ఒకవేళ అలిగినా అవి టీ కప్పులో తుఫాన్ లాంటివేనంటూ చెప్పుకొచ్చారు. అనంతరం కిషోర్ చంద్రదేవ్ నేరుగా అశోక్ గజపతిరాజు నివాసానికి వెళ్లారు. అశోక్ ను కలిసి తాను తెలుగుదేశం పార్టీలో చేరే అంశంపై చర్చించారు. 

అయితే కిషోర్ చంద్రదేవ్ ఆదివారం ఉదయం అమరావతిలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి జిల్లాకు చెందిన నేతలంతా హాజరయ్యారు కానీ కిషోర్ చంద్రదేవ్ మాత్రం హాజరుకాలేదు. దీంతో అశోక్ గజపతిరాజు ఇంకా అలకవీడలేదని ప్రచారం జరుగుతుంది. అందువల్లే కిషోర్ చంద్రదేవ్ పార్టీలో చేరే కార్యక్రమానికి హాజరుకాలేదా అన్న గుసగుసలు వినిపించాయి.  

PREV
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu