నాకెందుకు నోటీసులు ఇవ్వలేదంటున్నకేంద్ర మాజీ మంత్రి

By rajesh yFirst Published Sep 14, 2018, 3:40 PM IST
Highlights

సీఎం చంద్రబాబుతో సహా పలువురు నేతలపై ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చెయ్యడంపై తెలుగు రాష్ట్రాల్లో నిరసనల హోరు మిన్నంటుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మీడియా ముందుకొచ్చి కేంద్రప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. 

విజయనగరం: సీఎం చంద్రబాబుతో సహా పలువురు నేతలపై ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చెయ్యడంపై తెలుగు రాష్ట్రాల్లో నిరసనల హోరు మిన్నంటుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మీడియా ముందుకొచ్చి కేంద్రప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ఘటనకు సంబంధించి ఇప్పుడు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చెయ్యడం కుట్ర అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే కేంద్రమాజీ మంత్రి అశోక్ గజపతి రాజు మాత్రం తనకెందుకు నోటీసులివ్వలేదని వాపోతున్నారు. ఒకవైపు చంద్రబాబుకు వారెంట్ ఇవ్వడాన్ని ఖండిస్తూనే తనను ఎందుకు మరచిపోయారో అని ప్రశ్నించారు. 

బాబ్లీ ఘటనలో మరి నన్నెందుకు తప్పించారు అని కేంద్ర,మహారాష్ట్ర ప్రభుత్వాలను సూటిగా ప్రశ్నించారు. ఈ వ్యవహారం మొత్తం బీజేపీ రాజకీయ కుట్రలో భాగమేనని ఆరోపించారు. ప్రధాని మోదీ, అమిత్ షా ఇలాంటి పాత కేసులను తిరగదోడటం మంచిది కాదన్నారు.  


ఈవార్తలు కూడా చదవండి

చంద్రబాబును అరెస్ట్ చేస్తే మమ్మల్సి జైల్లో పెట్టమంటాం: మురళీమోహన్

ఎవరెన్ని కుట్రలు చేసినా చంద్రబాబును ఏమీ చెయ్యలేరు

చంద్రబాబుకు నోటీసు: భగ్గుమన్న ఎపీ టీడీపి నేతలు

click me!