ప్రాణ భయంలో విశాఖ వాసులు...2వేల మందికి అస్వస్థత, ఉద్రిక్తత

By telugu news teamFirst Published May 7, 2020, 10:21 AM IST
Highlights

ప్రతి ఇంటినీ పోలీసులు, సిబ్బంది తనిఖీ చేస్తున్నారు. ఇప్పటివరకూ 2వేల మందికి పైగా స్థానికులు అస్వస్థతకు గురయ్యారు. వారిని అంబులెన్స్‌లు, ఆటోలు, కార్లలో ఆస్పత్రులకు తరలిస్తున్నారు. మొత్తం 5 గ్రామాల ప్రజలు ఇళ్లు వదిలేసి బయటికొచ్చేశారు.

విశాఖ నగరంలోని గోపాలపట్నం పరిధి ఆర్‌.ఆర్‌.వెంకటాపురంలోని ఎల్‌.జి.పాలిమర్స్‌ పరిశ్రమ నుండి విషవాయువు విడుదలై ప్రమాదం సంభవించింది. అర్థరాత్రి సుమారు 2 నుంచి మూడు గంటల మధ్య ప్రాంతాల్లో ఈ కంపెనీలోని విషవాయువు స్టైరిన్ లీకై దాదాపు మూడు కిలోమీటర్ల పరిధిలో వ్యాపించింది. 

కాగా... జిల్లాలోని ఎల్జీ పాలిమర్స్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్యాస్‌ లీకేజిపై స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. 

ప్రతి ఇంటినీ పోలీసులు, సిబ్బంది తనిఖీ చేస్తున్నారు. ఇప్పటివరకూ 2వేల మందికి పైగా స్థానికులు అస్వస్థతకు గురయ్యారు. వారిని అంబులెన్స్‌లు, ఆటోలు, కార్లలో ఆస్పత్రులకు తరలిస్తున్నారు. మొత్తం 5 గ్రామాల ప్రజలు ఇళ్లు వదిలేసి బయటికొచ్చేశారు.

ఇప్పటి వరకూ ఊపిరాడక ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది. చుట్టు పక్కల నివాసముంటున్న ప్రజలు ఇళ్లను ఖాళీ చేయాలని సైరన్‌లు మోగించి పోలీసుల హెచ్చరిస్తున్నారు. ప్రజలు ఎక్కడికక్కడ పడిపోయారు. మరోవైపు.. వెంకటాపురంలో పెద్ద ఎత్తున పశువులు మృత్యువాతపడ్డాయి. పాలిమర్స్ చుట్టుపక్కల గ్రామాల్లోని చెట్లు మాడిపోయాయి.

చుట్టుపక్కల 20 గ్రామాలకు ఈ వాయువు వ్యాపించింది. చర్మంపై దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడం లో ఇబ్బందులతో స్థానికులు తీవ్ర స్వస్థత పాలయ్యారు.  అపస్మారక స్థితిలో రహదారిపై పడిపోయిన కొందరిని అంబులెన్స్‌ లో ఆసుపత్రికి తరలించారు పోలీసులు. 

click me!