సినీ పక్కీలో...ప్రయాణంలో వున్న కంటైనర్ నుండి దారిదోపిడీ

Published : Sep 16, 2020, 07:12 PM ISTUpdated : Sep 16, 2020, 07:23 PM IST
సినీ పక్కీలో...ప్రయాణంలో వున్న కంటైనర్ నుండి దారిదోపిడీ

సారాంశం

గుంటూరు జిల్లాలోని జాతీయ రహదారిపై భారీ చోరీ జరిగింది.

గుంటూరు జిల్లాలోని జాతీయ రహదారిపై భారీ చోరీ జరిగింది. త్తూరు జిల్లా తిరుపతి శ్రీసిటీ నుండి కలకత్తాకు ఎమ్ఐ సెల్ ఫోన్ల లోడ్ తో వెళుతున్న కంటైనర్ లో  సినీపక్కీలో దారిదోపిడి జరిగింది. కంటైనర్ గుంటూరు జిల్లాలోకి ప్రవేశించగానే ప్రయాణంలో వున్న కంటైనర్ వెనక నుంచి గుర్తు తెలియని దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. గుంటూరు జిల్లా నల్లపాడు వద్ద ఈ చోరీ జరిగినట్లు సమాచారం.

సుమారు 980 సెల్ ఫోన్లు చోరీకి గురైనట్లు గుర్తించిన కంటైనర్ డ్రైవర్లు పోలీసులకు సమాచారం అందించారు. సుమారు 80 లక్షల ఖరీదయిన సెల్ ఫోన్లు చోరీకి గురయి వుండొచ్చని అంచనా. కాజా టోల్ ప్లాజా వద్ద గల పోలీసులకు కంటైనర్ డ్రైవర్లు సమాచారం అందించారు. ఈ దారిదోపిడీపై సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ అమ్మిరెడ్డి సంఘటనా స్థలాన్ని, కంటైనర్ ని పరిశీలించారు. 

ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి వీలైనంత తొందరగా దోపిడీదొంగలను పట్టుకోవాలని ఎస్పీ స్థానిక పోలీసులకు ఆదేశించారు. దీంతో ఈ చోరీపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అతి త్వరలో ఈ కంటైనర్ ను దోచుకున్న దొంగలను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.


 

PREV
click me!

Recommended Stories

Weather Update: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
మారనున్న తిరుమల రూపురేఖలు సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం | CM Chandrababu Naidu Tirumala Visite