పవన్ తో వైసీపీ పొత్తు.. రోజా ఆసక్తికర కామెంట్స్

Published : Jan 03, 2019, 12:42 PM IST
పవన్ తో వైసీపీ పొత్తు.. రోజా ఆసక్తికర కామెంట్స్

సారాంశం

అబద్ధపు హామీలు, ఎల్లోమీడియా అండదండలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారన్నారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబుని నమ్మే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరని అభిప్రాయపడ్డారు.

అధికారం కోసం ఏపీ సీఎం చంద్రబాబు ఏ గడ్డి అయినా తింటారని.. ఆఖరికి గాడిద కాళ్లు కూడా పట్టుకుంటారని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. గత ఎన్నికల్లో చంద్రబాబు.. బీజేపీ,పవన్ తో జతకట్టారని.. ఈ ఎన్నికల నాటికి కాంగ్రెస్ తో జోడి కుదుర్చుకున్నారని మండిపడ్డారు. ఎన్నికల కోసం జతకట్టడం ఆ తర్వాత వారిపైనే బురద జల్లడం చంద్రబాబు నైజమని ఆమె ఆరోపించారు.

అబద్ధపు హామీలు, ఎల్లోమీడియా అండదండలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారన్నారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబుని నమ్మే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరని అభిప్రాయపడ్డారు. అనంతరం వచ్చే ఎన్నికల్లో పొత్తులపై ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. పవన్ తో పొత్తు పెట్టుకుంటే తమ వైసీపీకి ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు.

ముందు పవన్, చంద్రబాబులు విడిపోతే.. అప్పుడు జనసేనతో పొత్తు గురించి తాము ఆలోచిస్తామని ఆమె వివరించారు. ఇప్పటికీ పవన్.. టీడీపీతో రహస్య పొత్తు కొనసాగిస్తున్నారన్నారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Speech: అవకాశం చూపిస్తే అందిపుచ్చుకునే చొరవ మన బ్లడ్ లోనే వుంది | Asianet News Telugu
Chandrababu Speech:నన్ను420అన్నా బాధపడలేదు | Siddhartha Academy Golden Jubilee | Asianet News Telugu