గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన మంత్రి రోజా.. ఆమె ఏం చెప్పారంటే..?

By Sumanth KanukulaFirst Published Aug 7, 2022, 12:37 PM IST
Highlights

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియో వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించినట్టుగా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే గోరంట్ల మాధవ్ తీరుపై ప్రతిపక్షాలతో పాటు మహిళా, ప్రజాసంఘాలు భగ్గుమంటున్నాయి. 

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియో వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించినట్టుగా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే గోరంట్ల మాధవ్ తీరుపై ప్రతిపక్షాలతో పాటు మహిళా, ప్రజాసంఘాలు భగ్గుమంటున్నాయి. గోరంట్ల మాధవ్ వీడియో నిజమైనదేని.. ఆయన వైసీపీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నాయి. మరోవైపు వైసీపీ మహిళా నేతలు ఇలాంటి ఘటనలపై ఎందుకు స్పందించడం లేదనే ప్రశ్నలు వినిపిస్తున్నారు. 

ఈ క్రమంలోనే గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా స్పందించారు. రోజా ఓ న్యూస్ చానల్‌తో మాట్లాడుతూ.. ఎక్కడ ఏం జరిగిన రోజా ఎక్కడ అని అడుగుతున్నారంటే.. టీడీపీ, జనసేనలకు తన మీద ఎంత ప్రేమ ఉందోనని వ్యంగ్యస్త్రాలు సంధించారు. తనపై చాలా సందర్భాల్లో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మహిళలకు ఇబ్బంది కలిగిస్తే సీఎం జగన్ వదిలిపెట్టరని చెప్పారు. తమది మహిళ పక్షపాత ప్రభుత్వం అని చెప్పారు. మహిళల అభివృద్ది కోసం పని చేసే ముఖ్యమంత్రి జగన్ అని తెలిపారు.  

వీడియో నిజమో, కాదో తెలసుకోకుండా టీడీపీ విమర్శలు చేయడం తగదని అన్నారు. సీఎం జగన్ విచారణకు ఆదేశించారని చెప్పారు. టీడీపీ హయాంలో మహిళపై లెక్కలేనని దాడులు జరిగిన ఒక్క కేసు కూడా నమోదుచేయలేదని విమర్శించారు. నారాయణ స్కూల్స్‌లో ఆడపిల్లలు చనిపోతే ఒక్క కేసైనా పెట్టారా? అని ప్రశ్నించారు. 
మహిళలకు ఇబ్బంది  కలిగించే  విధంగా ఎవరూ ఏ తప్పు చేసినా సీఎం జగన్ కచ్చితంగా యాక్షన్ తీసుకుంటారని చెప్పారు. 

ఇక, గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై సీఎం జగన్ సీరియస్‌గా ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించిన ఏపీ మహిళా కమీషన్.. డీజీపీకి లేఖ రాసింది. ఇందుకు సంబంధించి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో డీజీపీని కోరింది. ఈ ఘటనలో త్వరగా నిజాలు నిగ్గు తేల్చాలని ఏపీ మహిళా కమీషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ డీజీపీని కోరారు.

మరోవైపు.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆశ్లీల వీడియో వెనుక టీడీపీ నేతల కుట్ర ఉందని హిందూపురం ఎంపీ Gorantla Madhav ఆరోపించారు.  హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ సోషల్ మీడియాలో  చక్కర్లు కొడుతున్న Obscene videoపై గురువారం నాడు స్పందించారు.  Morphing  చేసి ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని మాధవ్ ఆరోపించారు.  ఈ వీడియో విషయమై ఎలాంటి విచారణకైనా తాను సిద్దమని ప్రకటించారు. ఈ విషయమై ఎస్పీకి, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా ఎంపీ మాధవ్  వివరించారు.  ఈ కుట్ర వెనుక టీడీపీకి చెందిన చింతకాయల విజయ్, పొన్నూరి వంశీ, శివకృష్ణలున్నారని ఆయన ఆరోపించారు. తనపై కుట్ర పన్నిన ముగ్గురిపై పరువు నష్టం దావా వేస్తానని ఎంపీ గోరంట్ల మాధవ్ చెప్పారు.

click me!