ఇంటికొక బంగారు ముద్ద ఇస్తానంటాడు.. చంద్రబాబు మాటలు నమ్మొద్దు : ప్రజలకు మంత్రి పెద్దిరెడ్డి పిలుపు

Siva Kodati |  
Published : Oct 18, 2023, 03:48 PM IST
ఇంటికొక బంగారు ముద్ద ఇస్తానంటాడు.. చంద్రబాబు మాటలు నమ్మొద్దు : ప్రజలకు మంత్రి పెద్దిరెడ్డి పిలుపు

సారాంశం

 చంద్రబాబు మేనిఫెస్టోలో ఇంటికొక బంగారు ముద్ధ , రైతులకి ట్రాక్టర్, యువకులకు మోటార్ ఇస్తానని అంటాడని నమ్మొద్దన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి . ఆధారాలతో దొరికిపోయినప్పటికీ చంద్రబాబు తానేం చేయలేదని అంటున్నారని రామచంద్రారెడ్డి దుయ్యబట్టారు.  

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు మేనిఫెస్టోలో ఇంటికొక బంగారు ముద్ధ , రైతులకి ట్రాక్టర్, యువకులకు మోటార్ ఇస్తానని అంటాడని నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇసుక పాలసీపై మంత్రి మాట్లాడుతూ.. ఇసుకను జగన్ తమ్ముడికి ఇస్తున్నామంటూ విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇప్పటికే టెండర్లు పిలిచామని.. నాలుగు కంపెనీలు ముందుకు వచ్చాయని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. టెండర్లకు ఇంకా సమయం వుండగానే .. సీఎం సోదరుడిపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయం మొహం చూడని జగన్‌ను అప్పట్లో 16 నెలల జైల్లో పెట్టారని.. కానీ ఆధారాలతో దొరికిపోయినప్పటికీ చంద్రబాబు తానేం చేయలేదని అంటున్నారని రామచంద్రారెడ్డి దుయ్యబట్టారు. 

అంతకుముందు చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై కుటుంబసభ్యులు, టిడిపి శ్రేణుల ఆందోళనపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. స్కిల్ డెవలప్ మెంట్ తో పాటు అనేక పనుల్లో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డాడని.. అందువల్లే ఆయనను దర్యాప్తు సంస్థ సిఐడి అరెస్ట్ చేసిందన్నారు. చంద్రబాబుపై ఎవరికీ రాజకీయ  కక్ష లేదని... అక్రమంగా ఇరికించలేదని అన్నారు. చంద్రబాబు ను ఆయన కుటుంబసభ్యులే బట్టలిప్పి బయట నిలబెడుతున్నారని సజ్జల అన్నారు. 

Also Read: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు: ఏసీబీ కోర్టులో చంద్రబాబు పీటీ వారంట్ పై స్టే నవంబర్ 7 వరకు పొడిగింపు

అయితే చంద్రబాబును కక్షతోనే అరెస్ట్ చేసారని... జైల్లో వున్న ఆయనతో అమానవీయంగా ప్రవర్తిస్తున్నారని టిడిపి ప్రచారం చేస్తోందన్నారు. ఈ విషయంలో చంద్రబాబు కుటుంబం, టీడీపీ కాస్త సక్సెస్ అయినట్లు కనిపిస్తోందని సజ్జల అన్నారు. సంపాదించడం కోసమే సీఎం అయినట్లు చంద్రబాబు వ్యవహరించారని...  చివరకు టిడిపి అధినేతగా కూడా కుంభకోణాలకు పాల్పడ్డారని అన్నారు. ఇప్పుడు ఆయన అవినీతి బాగోతాన్ని బయటపెడుతుంటే దానిపై చర్చ లేకుండా ప్రజల దృష్టి మళ్లించేందుకు టిడిపి ప్రయత్నిస్తోందని సజ్జల అన్నారు. 

స్కిల్ డెవలప్ మెంట్ వ్యవహారంలో రూ.240 కోట్లను చంద్రబాబు షెల్ కంపనీల ద్వారా దోచుకున్నాడని సజ్జల ఆరోపించారు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు పాత్ర నేరుగా ఉందని ఆధారాలతో సహా బయటపడిందన్నారు. చంద్రబాబు మాజీ పీఎస్ వస్తే అంతా బయట పడుతుందన్నారు. చంద్రబాబు తప్పు చేసినట్లు న్యాయస్థానాలు నమ్మాయి కాబట్టే జ్యుడీషియల్ కస్టడీకి పంపించారని సజ్జల అన్నారు. ఆయన బెయిల్ కోసం ప్రయత్నించినా లాభం  లేకపోవడంతో సింపథీ కోసం ప్రయత్నిస్తున్నారని... అందుకోసమే అనారోగ్యం అంటున్నారని అన్నారు. రాజమండ్రి జైలు వైద్య సిబ్బంది చంద్రబాబుకు ప్రతి రోజూ చెకప్ చేస్తున్నారని... హెల్త్ రిపోర్ట్స్ కోర్టుకు పంపిస్తున్నారని అన్నారు. రిమాండ్ లో ఉన్న ఖైదీ హెల్త్ రిపోర్ట్స్ రోజూ ఎందుకు ఇస్తారు?  అని సజ్జల అన్నారు.  

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Independence Day Celebrations | Nara Bhuvaneswari | Asianet Telugu
CM Chandrababu Highlights @Independenceday 2026 | Asianet Telugu