జగన్‌ సభలో నిమ్మకాయ నీళ్లకు ఎంత ఖర్చయిందో తెలుసా..?

Published : Jul 05, 2024, 11:28 AM IST
జగన్‌ సభలో నిమ్మకాయ నీళ్లకు ఎంత ఖర్చయిందో తెలుసా..?

సారాంశం

‘‘దోపిడీకి హ‌ద్దులేదా జ‌గ‌న్? ప్ర‌జాధ‌నం పందికొక్కులా మెక్క‌డానికి సిగ్గులేదా? జ‌నం సొమ్ము అయితే చాలు నిమ్మ‌కాయ నీళ్ల‌లా దిగ‌మింగేశావు.’’

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. జగన్‌ చేసిన తప్పులను ఒక్కొక్కటిగా బయటకు తీస్తోంది. గత ప్రభుత్వం విచ్చలవిడిగా చేసిన ఖర్చులను బయటపెడుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ విషయం బయటకు వచ్చింది. గుడివాడలో నిర్వహించిన ఓ సభలో నిమ్మకాయ నీళ్ల కోసం భారీగా ఖర్చయిందట. ఇది తెలుసుకున్న మంత్రి నారా లోకేశ్‌.. మాజీ సీఎం జగన్‌ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజాధనాన్ని నిమ్మకాయ నీళ్లలా దోచేశారని ధ్వజమెత్తారు.

‘‘దోపిడీకి హ‌ద్దులేదా జ‌గ‌న్? ప్ర‌జాధ‌నం పందికొక్కులా మెక్క‌డానికి సిగ్గులేదా? జ‌నం సొమ్ము అయితే చాలు నిమ్మ‌కాయ నీళ్ల‌లా 28ల‌క్ష‌లు దిగ‌మింగేశావు. వైసీపీ పాల‌న‌లో గ‌డ్డం గ్యాంగ్ గుడివాడలో టిడ్కో ఇళ్ల ప్రారంభోత్స‌వానికి నిమ్మ‌కాయ నీళ్ల కోస‌మంటూ జ‌నం సొమ్ము 28 ల‌క్ష‌లు దోచేశారు. పేద‌లకి టిడ్కో ఇళ్లు మంజూరు చేయ‌డానికి 3 ల‌క్ష‌ల నుంచి 4 ల‌క్షలు దండుకున్నారు. గుడివాడ మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ సంత‌కం ఫోర్జ‌రీ చేసి 70 ల‌క్ష‌లు బిల్లులు చేసుకోవ‌డానికి గ‌డ్డం గ్యాంగ్ విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేసింది. అమృత్ ప‌థ‌కం కింద ప‌నులు చేయ‌కుండానే కోట్లు కొల్ల‌గొట్టేశారు. ఐదేళ్ల జ‌గ‌న్ పాల‌న‌లో గ‌డ్డం గ్యాంగ్ గుడివాడ నియోజ‌క‌వ‌ర్గాన్ని గుల్ల చేసింద‌న‌డానికి ఇవి కొన్ని ఉదాహ‌ర‌ణ‌లు మాత్ర‌మే’’ అని మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

మా ఆరడుగుల బుల్లెట్..! : Home Minister Anitha POWERFUL Speech | CM Chandrababu | Asianet News Telugu
కొండ‌ల‌ను చీల్చి గోదావ‌రిని తీసుకొచ్చిన ఇంజ‌నీరింగ్ అద్భుతం.. పోల‌వ‌రం ఎడ‌మ కాలువ నిర్మాణం