ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ బడ్జెట్ 2020-21: హైలైట్స్

Siva Kodati |  
Published : Jun 16, 2020, 05:02 PM ISTUpdated : Jun 16, 2020, 05:30 PM IST
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ బడ్జెట్ 2020-21: హైలైట్స్

సారాంశం

2020-21 ఆర్ధిక సంవత్సరానికి గాను ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కరోనా కష్టకాలంలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించామని మంత్రి అన్నారు

2020-21 ఆర్ధిక సంవత్సరానికి గాను ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కరోనా కష్టకాలంలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించామని మంత్రి అన్నారు. కౌలు రైతులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని కన్నబాబు స్పష్టం చేశారు. భూ యజమానులకు నష్టం కలగకుండా పంటపై కౌలుదారులకు హక్కు కల్పించామని ఆయన గుర్తుచేశారు. 

ముఖ్యాంశాలు:


* 29 వేల 159 కోట్ల 97 లక్షల రూపాయలతో వ్యవసాయ బడ్జెట్
* వ్యవసాయ యాంత్రీకరణకు రూ.207.83 కోట్లు
* పట్టు పరిశ్రమ అభివృద్ధికి రూ.92.18 కోట్లు
* ధరల స్థిరీకరణ నిధికి రూ.3 వేల కోట్లు
* రైతుల ఎక్స్‌గ్రేషియాకు రూ.20 కోట్లు
* ప్రకృతి వ్యవసాయానికి రూ.225.51 కోట్లు
* ఉద్యానవన అభివృద్ధికి రూ.653.02 కోట్లు
* పశు సంవర్థక శాఖకు రూ.854.77 కోట్లు
* వైఎస్ఆర్ ఉచిత పంటల బీమాకు రూ.500 కోట్లు
* ప్రకృతి విపత్తు నిధికి రూ.2 వేల కోట్లు
* వైఎస్ఆర్ ఉద్యాన వర్సిటీకి రూ.88.6 కోట్లు
* ఎన్జీ రంగా వర్సిటీకి రూ.402 కోట్లు
* రైతు భరోసా పథకం కింద ఏడాదికి రూ.13,500
* రూ.2,215 కోట్లతో వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు
* వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు
* ప్రతీ గ్రామం, పట్నంలో జనతా బజార్‌ల ఏర్పాటు
* జనతా బజార్ల ద్వారా రైతుల ఆదాయం పెరుగుతుంది
* నవరత్నాల్లో వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకానికి ముఖ్య స్థానం
* ఈ పథకానికి ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుంది
* పంట రుణాలపై సున్నా వడ్డీ పథకం కోసం రూ.1,100 కోట్లు

* రాయితీ విత్తననాల కోసం రూ.200 కోట్లు
* వెంకటేశ్వర పశు వైద్య శాలకు 122.73 కోట్లు
* మత్య అభివృద్ధికి రూ.299.27 కోట్లు
* సహకార శాఖకు రూ.248.38 కోట్లు
* వ్యవసాయ విద్యుత్ సబ్సిడీకి రూ.4,450 కోట్లు
* వ్యవసాయ అనుబంధ ఉపాధి హామీకి రూ.6,270 కోట్లు

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ సీజన్ లోనే కోల్డెస్ట్ 48 గంటలు.. ఈ ప్రాంతాల్లో చలిగాలుల అల్లకల్లోలమే
Roja vs Kirrak RP: నీ పిల్లల ముందు ఇలాంటి మాటలు అనగలవా? రోజాకు గట్టిగా ఇచ్చేసిన కిర్రాక్ ఆర్పి