నారా లోకేశ్‌తో కిడారి శ్రవణ్ భేటీ: రాజీనామాపై చర్చ

Siva Kodati |  
Published : May 09, 2019, 03:07 PM IST
నారా లోకేశ్‌తో కిడారి శ్రవణ్ భేటీ: రాజీనామాపై చర్చ

సారాంశం

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారాలోకేశ్‌తో మరో మంత్రి కిడారి శ్రవణ్ సమావేశమయ్యారు. గురువారం ఉదయం ఉండవల్లిలోని సీఎం అధికారికి నివాసానికి వచ్చిన శ్రవణ్.. మంత్రి పదవికి రాజీనామా అంశంపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.

శ్రవణ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఈ నెల 10వ తేదీ నాటికి ఆరు నెలలు అవుతోంది. ఈ నేపథ్యంలో ఆయనతో రాజీనామా చేయించాల్సిందిగా రాజ్‌భవన్ వర్గాలు సీఎంవోకు సూచించాయి.

దీంతో శ్రవణ్ మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్ధితి నెలకొంది. ఈ క్రమంలో లోకేశ్‌తో శ్రవణ్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. శ్రవణ్ కుమార్ ఇవాళ తన రాజీనామా లేఖను సీఎంకు సమర్పించనున్నారు. అనంతరం దానికి గవర్నర్ ఆమోదానికి పంపాల్సి ఉంటుంది. 

PREV
click me!

Recommended Stories

Andhra pradesh: ఏపీలో మరో హైటెక్ సిటీ.. కాగ్నిజెంట్ కార్యకలాపాలు ప్రారంభం, మరిన్ని సంస్థలు
Telangana Rains : తెలంగాణలో వర్షాలు.. సంక్రాంతి పండగవేళ వాతావరణం ఎలా ఉంటుందంటే...