డీఎస్సీపై త్వరలో నిర్ణయం: మంత్రి గంటా

By rajesh yFirst Published Sep 4, 2018, 8:22 PM IST
Highlights

త్వరలో డీఎస్సీపై నిర్ణయం తీసుకోనున్నట్లు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. విజయవాడలో ట్రిపుల్ ఐటీలకు సంబంధించి అధికారులు, డైరెక్టర్లతో మంత్రి గంటా శ్రీనివాస్ సమావేశమయ్యారు. ఈనెల 6న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఉపాధ్యాయ ఎంపిక పరీక్షపై తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఇప్పటికే ఖాళీలకు సంబంధించి వివరాలు సిద్ధం చేశామని గంటా తెలిపారు. 

విజయవాడ: త్వరలో డీఎస్సీపై నిర్ణయం తీసుకోనున్నట్లు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. విజయవాడలో ట్రిపుల్ ఐటీలకు సంబంధించి అధికారులు, డైరెక్టర్లతో మంత్రి గంటా శ్రీనివాస్ సమావేశమయ్యారు.

ఈనెల 6న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఉపాధ్యాయ ఎంపిక పరీక్షపై తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఇప్పటికే ఖాళీలకు సంబంధించి వివరాలు సిద్ధం చేశామని గంటా తెలిపారు. 

మరోవైపు ట్రిపుల్‌ ఐటీలలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానని మంత్రి గంటా తెలిపారు. ట్రిపుల్ ఐటీలలో పనిచేస్తున్నఒప్పంద అధ్యాపకులు, మెంటార్లు, బోధనేతర సిబ్బంది సమ్మె నోటీసు అంశంపై చర్చిస్తామన్నారు. అలాగే నూజివీడు ట్రిపుల్‌ ఐటీపై వస్తోన్న అనేక విమర్శలపైనా సమీక్షించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

click me!