ఎంత మంది పోటీలో ఉంటే అంత మంచిది.. బీఆర్ఎస్‌పై మంత్రి బొత్స స్పందన..

By Sumanth KanukulaFirst Published Oct 6, 2022, 2:18 PM IST
Highlights

టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్‌గా మార్చడంపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చుకోవడం వాళ్ల ఇష్టమని చెప్పారు. 

టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్‌గా మార్చడంపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చుకోవడం వాళ్ల ఇష్టమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అనేక పార్టీల్లో బీఆర్ఎస్ కూడా ఒక పార్టీ అవుతుందని అన్నారు. ఎంత మంది పోటీలో ఉంటే అంత మంచిదని అన్నారు. తమపై బీఆర్ఎస్ ప్రభావం ఉండబోదని స్పష్టం చేశారు.

అమరావతి రైతుల పాదయాత్రపై కూడా బొత్స సత్యనారాయణ మరోమారు తీవ్ర విమర్శలు చేశారు. రైతుల ముసుగులో టీడీపీ, రియల్ ఎస్టేట్ దోపిడిదారుల పాదయాత్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వారికి తామేందుకు సహకరించాలని ప్రశ్నించారు. అమరావతిలోని భూములను టీడీపీ నాయకులు దోచుకున్నారని ఆరోపించారు. టీడీపీ నాయకులు ఎంత దోచుకున్నారో అసెంబ్లీ సాక్షిగా వెల్లడించామని చెప్పారు. 

Also Read: మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పేరుతోనే బరిలోకి.. అప్పటివరకు అదే పేరు: క్లారిటీ ఇచ్చిన వినోద్ కుమార్..!

ఇదిలా ఉంటే.. ఇదిలా ఉంటే.. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును బీఆర్ఎస్‌గా మారుస్తూ బుధవారం ఆ పార్టీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశంలో అధికారికంగా ప్రకటించారు. దీంతో టీఆర్ఎస్.. ఇకపై భారత్ రాష్ట్ర సమితిగా మారనుంది. ఇక, తెలంగాణ భవన్‌లో జరిగిన సర్వసభ్య సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు సహా 283 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ పేరు మార్పు, ఎజెండాను కేసీఆర్.. పార్టీ నేతలకు కేసీఆర్ వివరించారు. ఈ సమావేశంలో కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి, వీసీకే చీఫ్ తిరుమలవలన్ కూడా పాల్గొన్నారు. పార్టీ పేరును మారుస్తూ కేసీఆర్ ప్రకటన చేసిన తర్వాత వారు శుభాకాంక్షలు చెప్పారు. 

ఇక, జాతీయ పార్టీని ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో విస్తరించేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీలో ఇప్పటికే ఆయన పలువురు టీడీపీ నేతలతో చర్చలు జరిపినట్టుగా వార్తలు వస్తున్నాయి. అలాగే పలు సామాజిక వర్గాలకు చెందిన నేతలను ఆయన తమ పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించినట్టుగా వార్తలు వస్తున్నాయి.  

click me!