చంద్రబాబు ఆరోగ్యంపై ఆరోపణలు .. అవన్నీ జిమ్మిక్కులే , కోర్టులో పిటిషన్ ఎందుకు వేయలేదు : బొత్స

Siva Kodati | Published : Oct 14, 2023 3:49 PM
Google News Follow Us

సారాంశం

చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు . చంద్రబాబుకు అనారోగ్యంగా వుంటే కోర్టులో ఎందుకు పిటిషన్ వేయలేదని బొత్స ప్రశ్నించారు.  

చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వారి అనుకూల మీడియాలో ఇష్టం వచ్చినట్లు కథనాలు ప్రసారం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు అనారోగ్య సమస్యలు వుంటే కోర్టుకు విన్నవించుకోవాలన్నారు. చంద్రబాబు అనారోగ్యంగా వున్నారని ఆయన కుటుంబసభ్యులకు అనిపిస్తే కోర్టుకు విన్నవించుకోవాలని ఫైర్ అయ్యారు. జిమ్మిక్కులతో చంద్రబాబు ఇన్నాళ్లు నెట్టుకొచ్చారని.. ఆయన ఇప్పుడు ఆధారాలతో దొరికిపోయారని బొత్స దుయ్యబట్టారు. 

Also Read: చంద్రబాబు బరువు తగ్గలేదు .. జైల్లో ఇంకో కేజీ పెరిగారు : సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు (వీడియో)

చంద్రబాబు తప్పు చేశారు కాబట్టే అరెస్ట్ చేశారని మంత్రి స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబుకు అనారోగ్యమని మాట్లాడుతున్నారని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. చంద్రబాబు ఆరోగ్యంగా వుండాలనే కోరుకుంటామన్నారు. చంద్రబాబుకు అనారోగ్యంగా వుంటే కోర్టులో ఎందుకు పిటిషన్ వేయలేదని బొత్స ప్రశ్నించారు. టీడీపీ నేతలు, బాబు కుటుంబ సభ్యులే ఫోన్లు చేయిస్తున్నారని సత్యనారాయణ ఆరోపించారు. జిమ్మిక్కులు చేస్తే నష్టపోయేది టీడీపీయేనని ఆయన దుయ్యబట్టారు. 

Read more Articles on