కమ్మలు కాదు వారు తల్చుకుంటే తప్పకుండా అయిపోతారు: చంద్రబాబుకు అనిల్ హెచ్చరిక

By Arun Kumar PFirst Published Apr 16, 2020, 12:19 PM IST
Highlights
కమ్మవారిని వైసిపి ప్రభుత్వం టార్గెట్ చేస్తోందంటూ మాజీ ఎంపీ  రాయపాటి చేసిన విమర్శలపై మంత్ని అనిల్ కుమార్ యాదవ్ ఘాటుగా స్పందించారు. 
అమరావతి: రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతి రోజు సమీక్ష చేస్తున్నారని... అయితే ఆయన  పబ్లిసిటీకి దూరంగా పని చేస్తున్నారు కాబట్టే ఈ విషయం బయటకు రావడంలేదని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి పని తీరును జాతీయ మీడియా ప్రశంసించిందని... కానీ చంద్రబాబు మాత్రం మీడియా సమావేశాలు పెట్టి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 

పక్క రాష్ట్రంలో ఉండి చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని... హైదరాబాద్ నుండి ఆయన చేస్తున్నవన్ని చిల్లర రాజకీయాలేనని అన్నారు. ఒక్క టీడీపీ నేత ప్రజలకు సహాయం చేసిన సందర్భంగా ఉందా..? అని ప్రశ్నించారు. ప్రభుత్వంపై యదవ రాజకీయం  చేస్తూ టీడీపీ నేతలు సునకానందం పొందుతున్నారని అనిల్ కుమార్ విమర్శించారు. 

కేవలం ఒక్క కమ్మవారు తలుచుకుంటే ఎవరు అయిపోరని ప్రజలంతా తలుసుకుంటేనే ఎవరైనా అయిపోతారన్నారు... అలా ప్రజలు తలుసుకున్నారు కాబట్టే చంద్రబాబు, రాయపాటి అయిపోయారని అన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీకి కనీసం 23 సీట్లు వచ్చాయి...వచ్చే ఎన్నికల్లో 2 లేదా 3 సీట్లు మాత్రమే వస్తాయన్నారు. 

 పోటీ ప్రపంచంలో ప్రతి పేదవానికి ఇంగ్లీషు మీడియం అందించాలని సీఎం భావించారని అన్నారు. ఇంగ్లీషు మీడియంలో కేవలం టీడీపీ నేతల కొడుకులు, మనవళ్లే చదువుకోవాలా..? అని ప్రశ్నించారు. ఇంగ్లీషు మీడియంను వ్యతిరేకించే ఎల్లో మీడియా ప్రతినిధుల పిల్లలు కూడా ఇంగ్లీషు మీడియంలో చదువుతున్నారుని తెలిపారు. 

''మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మనవడు ఏ మీడియంలో చదువుతున్నాడు.చంద్రబాబు మనవుడుని ఎందుకు తెలుగు మీడియంలో చదివించలేదు. లోకేష్ ను ఎందుకు అమెరికాలో చంద్రబాబు చదివించాడు'' అంటూ అనిల్ కుమార్ ప్రశ్నించారు. తన బినామిలయిన నారాయణ, చైతన్యలను బతికించడానికి ఇంగ్లీషు మీడియంను చంద్రబాబు వ్యతికేస్తున్నారని ఆరోపించారు. 

''గతంలో కేంద్ర హోమ్ శాఖ కు లేఖ రాసారా? అని అడిగితే నిమ్మగడ్డ రమేష్ నోరు మెడపలేదు. ఇప్పుడు దీనిపై డీజీపీకి ఎంపీ విజయసాయిరెడ్డి పిర్యాదు చేస్తే నిమ్మగడ్డ నోరు విప్పారు. విజయసాయిరెడ్డి అడిగిన మూడు ప్రశ్నలకు ఎందుకు నిమ్మగడ్డ సమాధానం చెప్పలేదు. ఆ లేఖను ఎవరు డ్రాఫ్ట్ చేశారో, ఏ ఐడి అడ్రస్ నుంచి మెయిల్ వెళ్లిందో నిమ్మగడ్డ రమేష్ సమాధానం చెప్పాలి'' అని డిమాండ్ చేశారు. 

''చంద్రబాబు బుర్ర ఎల్లో వైరస్ తో నిండిపోయింది. ప్రస్తుతం రెండు వేల కరోనా టెస్టులు చేస్తున్నారు. రెండు మూడు రోజుల్లో రోజుకు నాలుగు వేల కరోనా టెస్టులు చేయబోతున్నారు. చంద్రబాబు కు కరోనా వైరస్ వస్తే ప్రభుత్వం దాస్తుందా...? లేదా టీడీపీ నేతలకు వచ్చిన కరోనా కేసులను ప్రభుత్వం దాచి పెడుతుందా..? ఎవరికి వచ్చిన కరోనా కేసులు దాచిపెట్టామో చంద్రబాబు చెప్పాలి" అని అనిల్ కుమార్ నిలదీశారు. 
 
click me!