ప్రపంచ వారసత్వ కట్టడాల్లో.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి నిర్మాణాలు : అనిల్ కుమార్ యాదవ్

By AN TeluguFirst Published Dec 9, 2020, 3:48 PM IST
Highlights

ఇప్పటికీ సాగునీటి, త్రాగు నీటి అవసరాలు తీరుస్తున్న 14 సాగునీటి కట్టడాలను ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడాలుగా గౌరవం దక్కాయని నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హర్హం వ్యక్తం చేశారు. మన రాష్ట్రంలో మూడు సాగునీటి కట్టడాలు..కంభం చెరువు, కేసి కెనాల్, పోరు మామిళ్ల చెరువు కు అంతర్జాతీయ గుర్తింపు లభించిందని తెలిపారు.

ఇంటర్ నేషనల్ కమిషన్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ (ఐసి ఐడి) 1950 లో స్థాపించారని అన్నారు. 2023 వైజాగ్ లో దీనికి సంబంధించి కాన్ఫరెన్స్ జరుగుతుంది.. 78 దేశాల ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు.

ఈ కాన్ఫరెన్స్ కు ప్రపంచంలో ఉన్న శాస్తవ్రేత్తలు, నిపుణులు హాజరవుతారని, పురాతన నీటి కట్టడాలను వారసత్వ సంపదగా గుర్తించి అవార్డులు ఇస్తారని పేర్కొన్నారు. 

సూక్ష్మ నీటిపారుదల రంగంలో కృషి చేసిన అనంతపురం జిల్లాకు చెందిన ఒక రైతుకు  కూడా అవార్డు వచ్చిందని గుర్తు చేశారు. స్వర్గీయ వైఎస్ హయాంలో మైక్రో ఇరిగేషన్ లో మనకి అవార్డు వచ్చిందని అలాగే మరిన్ని వస్తాయన్నారు. 

రాప్తాడు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరందిస్తామంటూ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ముట్టాల, తోపుదుర్తి, దేవరకొండ రిజర్వాయర్ల నిర్మాణానికి బుధవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుకు వైఎస్సార్‌ అప్పర్‌ పెన్నార్‌ ప్రాజెక్టుగా నామకరణం చేశారు.

click me!