పప్పును కాను: నారా లోకేష్ పై మంత్రి అనిల్ పరోక్ష వ్యాఖ్య

By telugu teamFirst Published Jun 17, 2019, 11:48 AM IST
Highlights

తనకు ఏమీ తెలియకపోయినా నేర్చుకుంటానని అనిల్ కుమార్ అన్నారు. మంగళగిరిని కూడా సరిగా పలకలేని పప్పును తాను కానని ఆయన అన్నారు. మంగళగిరిని కూడా పలకలేని వ్యక్తిని మంత్రిని చేశారని అన్నారు. 

అమరావతి: మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్ మీద పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఏమీ తెలియని అనిల్ మంత్రై చంద్రబాబు నాయుడినే విమర్శిస్తున్నారని తెలుగుదేశం పార్టీ సభ్యుడు అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకు స్పందిస్తూ అనిల్ కుమార్ పరోక్షంగా నారా లోకేష్ ను ప్రస్తావించారు. 

తనకు ఏమీ తెలియకపోయినా నేర్చుకుంటానని అనిల్ కుమార్ అన్నారు. మంగళగిరిని కూడా సరిగా పలకలేని పప్పును తాను కానని ఆయన అన్నారు. మంగళగిరిని కూడా పలకలేని వ్యక్తిని మంత్రిని చేశారని అన్నారు.  టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, ఆ పార్టీ నేతలు ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమలోనే ఉన్నారని ఆయన అన్నారు. 

ప్రతిపక్షంలోకి వెళ్లిన తర్వాత కూడా అచ్చెన్నాయుడు తీరు మారలేదని మండిపడ్డారు. ధర్మపోరాట దీక్ష పేరుతో రూ.500 కోట్లు వృధా చేశారని విమర్శించారు. ఐదేల్ల మహత్తరమైన పరిపాలన అందిచారు కాబట్టే టీడీపీని ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని వ్యాఖ్యానించారు. 

నీటి బొట్టులేకుండా నీడ నిచ్చే చెట్టు లేకుండా టీడీపీ నేతలు రూ. 80వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు అంచానాలను టీడీపీ పెంచిదని అనిల్ అన్నారు. ధర్మపోరాట దీక్ష పేరులో కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారని ఆరోపించారు.

అలీ బాబా 40 దొంగల్లాగా.. ఆలీ బాబు చోర్‌ అని 23 మంది వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలను లాక్కున్నారు కాబట్టే.. ఆలీ బాబు గారికి 23(ఎమ్మెల్యేలను) మందినే భగవంతుడు ఇచ్చాడని అనిల్ అన్నారు. 

పోలవరానికి 24 పర్మీషన్లు అవసరమైతే 23 పర్మీషన్లను తీసుకొచ్చిన ఘనత దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డిదేని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. నేడు పోలవరం ప్రాజెక్టు కొనసాగడానికి కారణం కూడా వైఎస్సారేనని తెలిపారు. 

గుంటూరు ఆస్పత్రిలో ఓ బాలుడు ఎలుకలు కొరికి చనిపోతే ఆ ఎలుకలను పట్టుకోవటానికి ఒక్కో ఎలుకకు లక్షల రూపాయలు టీడీపీ ప్రభుత్వం ఖర్చు పెట్టిందని అన్నారు. 300 ఎలుకలను పట్టుకోవటానికి దాదాపు 60 లక్షల రూపాయలు ఖర్చు చేశారంటూ మండిపడ్డారు. 

click me!