నెల్లూరులో దారి దోపిడి.. స్మార్ట్ ఫోన్ల అపహరణ

Published : Feb 13, 2019, 09:47 AM IST
నెల్లూరులో దారి దోపిడి.. స్మార్ట్ ఫోన్ల అపహరణ

సారాంశం

నెల్లూరు జిల్లా కావలి మండలం దగదర్తి హైవే రోడ్డుపై మంగళవారం రాత్రి దారి దోపిడీ జరిగింది.

నెల్లూరు జిల్లా కావలి మండలం దగదర్తి హైవే రోడ్డుపై మంగళవారం రాత్రి దారి దోపిడీ జరిగింది.  ప్రముఖ చైనా కంపెనీ ఎంఐ కి చెందిన స్మార్ట్ ఫోన్ల లోడ్ తో వెళ్తున్న లారీపై దుండగులు దాడి చేశారు.

స్మార్ట్ ఫోన్ల లోడ్ తో లారీ వస్తుందన్న ముందస్తు సమాచారం మేరకు దుండగలు ఆ దారిలో కాపు కాశారు. డ్రైవర్‌ను చితకబాది ఫోన్లను వేరే లారీలోకి మార్చకుని ఎత్తుకెళ్లారు. శ్రీసిటీ నుంచి కోటి రూపాయల విలువైన ఫోన్లను లారీలో తీసుకెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

AP Power Sector : ఏపీకి కొత్త పవర్ ప్లాన్.. తీరనున్న కరెంట్ కష్టాలు..భవిష్యత్ కోసం బ్యాటరీ స్టోరేజ్
IRCTC Tirupati Kolhapur Tour: ఒక్క టికెట్ తో తిరుమల శ్రీవారి నుంచి కొల్హాపూర్ అమ్మవారి దర్శనం వరకు.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్