గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో దారుణం... వైద్యుల నిర్వాకంతో ప్రాణాపాయ స్థితిలో చిన్నారి

Arun Kumar P   | Asianet News
Published : May 09, 2022, 02:42 PM ISTUpdated : May 09, 2022, 02:52 PM IST
గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో దారుణం... వైద్యుల నిర్వాకంతో ప్రాణాపాయ స్థితిలో చిన్నారి

సారాంశం

ఎన్ని సంఘటనలు వెలుగుచూస్తున్నా ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వాస్పత్రుల తీరు మారడం లేదు. తాజాగా వైద్యసిబ్బంది నిర్లక్ష్యంతో ఓ చిన్నారి ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్న విషాదం గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో వెలుగుచూసింది. 

గుంటూరు: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాస్పత్రుల్లో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా సామాన్యులు ఇబ్బందులకు గురయిన అనేక సంఘటనలు ఇటీవల వెలుగుచూసాయి. అయితే ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం, ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకవడంతో ఏపీలో వైద్యసిబ్బంది తీరులో ఏమాత్రం మార్పు రావడం లేదు. తాజాగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో ఓ చిన్నారి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లింది. 

వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లాకు చెందిన ఐదేళ్ల చిన్నారి ఆరాధ్యకు కంటిపై కణితి రావడంతో కంగారుపడిపోయిన తల్లిదండ్రులు గుంటూరు ప్రభుత్వాత్రికి తరలించారు. చిన్నారికి అన్ని పరీక్షలు నిర్వహించిన వైద్యులు కణితిని తొలగించేందుకు మైనర్ ఆపరేషన్ చేయాలని సూచించారు. కేవలం పది నిమిషాల్లో ఆపరేషన్ పూర్తవుతుంది... ప్రాణాపాయం ఏమాత్రం లేదని డాక్టర్లు భరోసా ఇవ్వడంతో చిన్నారి తల్లిదండ్రులు ఆపరేషన్ కు ఒప్పుకున్నారు. 

అయితే గత గురువారం ఆరాధ్యకు ఆపరేషన్ చేయగా ఇప్పటివరకు ఐసియూలోనే వుంచారని... పదినిమిషాల ఆపరేషన్ అని చెప్పి తమ బిడ్డ ప్రాణాలమీదకు తెచ్చారని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఆపరేషన్  జరిగి ఇప్పటికి మూడురోజులు గడుస్తున్నా చిన్నారి ఇంకా స్పృహలోకి రాలేదని... వెంటిలేటర్ పై వుంచి చికిత్స అందిస్తున్నట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. ఆపరేషన్ సమయంలో వైద్యసిబ్బంది  నిర్లక్ష్యం కారణంగానే తమ కూతురికి ఈ పరిస్థితి వచ్చిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 

ఆపరేషన్ సమయంలో నిర్లక్ష్యం అనస్తీషియా ఇవ్వడంవల్లే ఆరాధ్య పరిస్ధితి విషమంగా మారినట్లు ఆరోపిస్తున్నారు. ఆరోగ్యంగ వున్న పాపను చిన్న సమస్యతో ఆసుపత్రికి తీసుకువస్తే నయంచేయాల్సిన వైద్యులే ఇలా చనిపోయే స్థితికి తీసుకువచ్చారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పాపను బ్రతికించండి అంటూ తల్లిదండ్రులు, బంధువులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్లక్ష్యానికి కారణమైన ప్రభుత్వ ఆసుపత్రి సూపరిటెండెంట్ తక్షణమే చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తోంది. 

ఇప్పటికే ఏపీలోని ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో చోటుచేసుకుంటున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. ఏదైనా సంఘటన జరిగినప్పుడు హడావిడి చేయడం తప్ప ఆస్పత్రి సిబ్బంది తీరులో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలోనే ఓ మానసిక వికలాంగురాలిని బంధించి కొందరు దుండుగులు గ్యాంగ్ రేప్ చేసారంటేనే వాటి నిర్వహణ ఎంత గొప్పగా వుందో అర్థమవుతుంది. 

ఇక ఇటీవల కాలంలో హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మృతదేహాలను తల్లిదండ్రులే ద్విచక్ర వాహనాలపై తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. వరుసగా ఇలాంటి ఘటనలు రెండుమూడు చోటుచేసుకున్నారు. అయినప్పటికి వైద్యసిబ్బంది తీరులో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. 

రాయలసీమలోనే పెద్ద ఆస్పత్రిగా పేరుపొందిన తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో అంబులెన్స్‌ల దందా వెలుగుచూడటం సంచలనం రేపిన సంగతి తెలిసిందే.  తాజాగా ఆస్పత్రికి వచ్చే పేషెంట్లతో సిబ్బంది ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారో తెలిపే ఘటన ఒకటి వెలుగుచూసింది. వైద్యానికి డబ్బులు ఖర్చు చేసే స్థోమత లేని నిరుపేదలే ఎక్కువగా ఉంటారు. అలాంటి వారి నుంచి ఆస్పత్రి సిబ్బంది డబ్బులు డిమాండ్ చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు.

ఇటీవల పుత్తూరుకు చెందిన నాగరత్న ఆపరేషన్ కోసం రుయా ఆస్పత్రికి రాగా.. అక్కడి సిబ్బంది డబ్బులు డిమాండ్ చేశారు. బాధితురాలు సిబ్బందికి గూగుల్ పే చేసి..  ఆ స్క్రీన్ షాట్ అధికారులకు పంపించారు. దీంతో రుయాలో అవినీతి బాగోతం బయటపడింది. 
 

PREV
click me!

Recommended Stories

Hello Lokesh Interaction: హలో లోకేష్ కార్యక్రమంలోవిద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Asianet News Telugu
Minister Nara Lokesh: మంత్రి లోకేష్ నే ర్యాగింగ్ చేసిన విద్యార్థి అందరూ షాక్| Asianet Telugu