హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా మసాజ్ సెంటర్.. 19మంది అరెస్ట్..

Published : May 22, 2023, 10:20 AM IST
హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా మసాజ్ సెంటర్.. 19మంది అరెస్ట్..

సారాంశం

ఓ హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా మసాజ్ సెంటర్ నడుపుతున్నారు. పోలీసులు పక్కా సమాచారంలో మెరుపుదాడులు చేసి 19మందిని అరెస్ట్ చేశారు. 

విజయవాడ : ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని మసాజ్ కేంద్రాలపై పోలీసులు శనివారం మెరుపు దాడులు చేయగా హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో.. గుట్టు చప్పుడు కాకుండా మసాజ్ సెంటర్ నడుపుతున్నట్లుగా తేలింది. ఈ మెరుపు దాడుల్లో 19 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

పెనుమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెనుమలూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న తాడిగడప వంద అడుగుల రోడ్డులో మసాజ్ కేంద్రం, ఇంజనీరింగ్ కాలేజ్ ఎదురుగా శ్రీనివాస నగర్ కాలనీలోని ఒక ఇంట్లో ఒక మసాజ్ కేంద్రం, పోరంకిలో ఒక మసాజ్ కేంద్రాలలో గుట్టుచప్పుడు కాకుండా నడుస్తోంది.

ప్రకాశం మర్డర్ కేసు : 15 రోజులుగా సిమ్ లు, ప్రాంతాలు మార్చి భార్యతో వేరే వ్యక్తిలా ఛాటింగ్ చేస్తూ... హతమార్చి

అయితే ఇందులో ఓ మసాజ్ కేంద్రం నడుస్తున్న ఇల్లు హెడ్ కానిస్టేబుల్ కిషోర్ దిగా తేలింది.  ఆయన పెనుమాలూరు పోలీస్స్టేషన్లో  పనిచేస్తున్నాడు. ఈ కేంద్రాల్లో వ్యభిచారం జరుగుతుందన్న ఆరోపణలు రావడంతో.. పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ కేంద్రాల మీద నిగా పెట్టిన పోలీసులు 12 మంది మహిళలు ఏడుగురు పురుషులను అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల్లోనే హెడ్ కానిస్టేబుల్ మీద ఆరోపణలు రావడంతో ఎస్పీ జాషువా అతని మీద విచారణకు ఆదేశాలు జారీ చేశారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

వొళ్ళు గగురు పుట్టే విన్యాసాలతో అదరగొట్టిన పోలీస్ సిబ్బంది | Nara Lokesh | Independence Day | Stunts
ఈ బైకర్ విన్యాసాలకి మంత్రి నారా లోకేష్ ఫిదా | Nara Lokesh Particepate Independence Day Celebrations