కోనసీమ జిల్లాలో షాకింగ్ ఘటన.. ప్రియుడిని ఇంటికి పిలిచి మర్మాంగం కోసేసిన వివాహిత..

Published : Dec 19, 2022, 04:55 PM IST
కోనసీమ జిల్లాలో షాకింగ్ ఘటన.. ప్రియుడిని ఇంటికి పిలిచి మర్మాంగం కోసేసిన వివాహిత..

సారాంశం

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తాటిపాకలో దారుణం చోటుచేసుకుంది. ఓ వివాహిత  తన ప్రియుడి మర్మాంగాన్ని బ్లేడుతో కోసేసింది. 

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తాటిపాకలో దారుణం చోటుచేసుకుంది. ఓ వివాహిత  తన ప్రియుడి మర్మాంగాన్ని బ్లేడుతో కోసేసింది. రెండు రోజుల క్రితం చోటుచేసుకన్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గూడపల్లి గ్రామానికి చెందిన కటికిరెడ్డి కృష్ణ గణేష్ తాటిపాకకు చెందిన ఓ పెళ్లైన మహిళలకు మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతుంది. రెండు రోజుల క్రితం భర్త బయటకు వెళ్లాడని చెప్పిన మహిళ.. ప్రియుడిని ఇంటికి రమ్మని పిలిచింది. అయితే ఇంటికి వచ్చిన కృష్ణతో మహిళ వాగ్వాదానికి దిగింది. 

కృష్ణ మరికొందరు మహిళలతో కూడా వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నాడనే అనుమానంతో అతడితో గొడవకు దిగింది. ఈ క్రమంలోనే బ్లేడ్‌తో కృష్ణ మర్మాంగంపై దాడి చేసింది. దీంతో తీవ్రంగా గాయపడిన కృష్ణ బయటకు పరుగులు తీశాడు. తీవ్ర గాయంతో బాధపడుతున్న కృష్ణ చివరకు ఆస్పత్రిలో చేరాడు. ప్రస్తుతం కృష్ణకు ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుంది. ఈ ఘటనకు సంబంధించి కృష్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు  చేశారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!