కిడ్నాప్ యత్నం: చితకబాదిన ప్రయాణికులు

Published : Jul 04, 2019, 03:15 PM IST
కిడ్నాప్ యత్నం: చితకబాదిన ప్రయాణికులు

సారాంశం

అనంతపురం జిల్లా కదిరి బస్టాండ్‌లో చిన్నారిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని ప్రయాణీకులు చితకబాది పోలీసులకు అప్పగించారు.  

అనంతపురం: అనంతపురం జిల్లా కదిరి బస్టాండ్‌లో చిన్నారిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని ప్రయాణీకులు చితకబాది పోలీసులకు అప్పగించారు.

అనంతపురం జిల్లా కదిరి బస్టాండ్ లో  ఓ చిన్నారిని కుటుంబసబ్యుల కళ్లుగప్పి కిడ్నాప్ చేసేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. ఈ విషయాన్ని బస్టాండ్‌లోని ప్రయాణీకులు గుర్తించి కిడ్నాప్ చేసేందుకు యత్నించిన వ్యక్తిని చితకబాదారు. ఆ తర్వాత  పోలీసులకు సమాచారం ఇచ్చారు.

కదిరి పట్టణంలో తాను  వచ్చినప్పటి నుండి  కిడ్నాపర్ వెంబడిస్తున్నాడని చిన్నారి తల్లి  ఆరోపించింది. తన కూతురిని ఎత్తుకెళ్తున్న సమయంలో ప్రయాణికులు అడ్డుకొని తన బిడ్డ తనకు దక్కేలా చేశారని ఆమె చెప్పారు.
 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu