గొడవ చేస్తుంటే సర్దిచెప్పాడని.. రైలులో నుంచి హోంగార్డును..

Published : Jan 06, 2020, 07:47 AM IST
గొడవ చేస్తుంటే సర్దిచెప్పాడని.. రైలులో నుంచి హోంగార్డును..

సారాంశం

 ఆ రైలులో ప్రయాణిస్తున్న హబీబ్‌ అనే ఉన్మాది తోటి ప్రయాణికులను ఇబ్బంది పెట్టడాన్ని గమనించాడు. తుని సమీపంలో.. అతడిని వారించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో హోంగార్డు శివతో ఉన్మాది వాగ్వాదానికి దిగాడు. 


రైల్లో తోటి ప్రయాణికులతో వాదనలకు దిగుతూ... అందరినీ ఇబ్బంది పెడుతున్నాడని సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. తనను వారించాడనే కోపంతో.. ఓ వ్యక్తి.. హోంగార్డును కదులుతున్న రైలు లో నుంచి కిందకు తోసేశాడు. ఈ దారుణ సంఘటన తూర్పుగోదావరి జిల్లా తునిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... కోటనందూరు స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్న రెడ్డి సూర్య వెంకట శివ(36) విధి నిర్వహణలో భాగంగా సామర్లకోటలో పని ముగించుకుని బొకారో ఎక్స్‌ప్రె్‌సలో తిరిగి వస్తున్నాడు. ఆ రైలులో ప్రయాణిస్తున్న హబీబ్‌ అనే ఉన్మాది తోటి ప్రయాణికులను ఇబ్బంది పెట్టడాన్ని గమనించాడు. 

తుని సమీపంలో.. అతడిని వారించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో హోంగార్డు శివతో ఉన్మాది వాగ్వాదానికి దిగాడు. తరువాత తనను అదుపు చేయాలని చూశాడనే కోపంతో.. శివను  కదులుతున్న రైలు నుంచి తోసేశాడు. దీంతో శివ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే  మృతి చెందాడు.

PREV
click me!

Recommended Stories

ప్రశ్నిస్తే అక్రమ కేసులు అక్రమ అరెస్ట్ లు: జగన్‌ | YS Jagan Pressmeet Devarapalli
జగన్ హెలికాప్టర్ చుట్టుముట్టిన జనం | YS Jagan Devarapalli Tour | Asianet News Telugu