మైలవరంలో విషాదం: ట్రాక్టర్ టైర్ పేలి ఒకరు మృతి

Published : Feb 21, 2023, 10:20 AM IST
 మైలవరంలో విషాదం: ట్రాక్టర్ టైర్ పేలి  ఒకరు మృతి

సారాంశం

ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో  విషాదం నెలకొంది. ట్రాక్టర్  టైరులో  గాలి నింపుతున్న సమయంలో టైరు పేలి  ఓ వ్యక్తి మృతి చెందాడు 

విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో  ట్రాక్టర్  టైర్ పేలి  మంగళవారంనాడు  ఉదయం  అన్వర్   అనే వ్యక్తి మృతి చెందాడు.  ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో   పంక్చర్ దుకాణంలో  అన్వర్ పనిచేస్తున్నాడు.  అన్వర్ ది  కైకలూరు గ్రామం.  ఇవాళ  ఉదయం  ట్రాక్టర్ టైర్ లో గాలి నింపాలని  ఓ కస్టమర్ కోరాడు.  అయితే  ట్రాక్టర్  టైరులో  గాలి నింపే సమయంలో  ప్రమాదవశాత్తు  టైర్  పేలింది.  దీంతో  టైర్  బలంగా  అన్వర్ ను తాకింది. ఈ  ఘటనలో  అన్వర్  తీవ్రంగా  గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయమై  స్థానికులు  పోలీసులకు సమాచారం అందించారు.  ఈ సమాచారం ఆధారంగా సంఘటన స్థలాన్ని పరిశీలించారు.  కేసు నమోదు  చేసుకొని దర్యాప్తు  చేస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే