దివ్యాంగుడిని పెళ్లి చేసుకొందని చెల్లెలు గొంతు కోసిన అన్న

Published : Jun 19, 2019, 12:43 PM IST
దివ్యాంగుడిని పెళ్లి చేసుకొందని చెల్లెలు గొంతు కోసిన అన్న

సారాంశం

ర్నూల్ జిల్లాలోని నంద్యాలలో బుధవారం నాడు దారుణం చోటు చేసుకొంది.దివ్యాంగుడిని పెళ్లి చేసుకొందని చెల్లెలు గొంతుకోశాడు ఆమె సోదరుడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు.   

నంద్యాల: కర్నూల్ జిల్లాలోని నంద్యాలలో బుధవారం నాడు దారుణం చోటు చేసుకొంది.దివ్యాంగుడిని పెళ్లి చేసుకొందని చెల్లెలు గొంతుకోశాడు ఆమె సోదరుడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. 

నంద్యాలలోని నూనెపల్లిలో జ్యోతి అనే యువతి దివ్యాంగుడిని ప్రేమించి ఇటీవలే పెళ్లి చేసుకొంది. ఈ పెళ్లి ఇష్టం లేని జ్యోతి సోదరుడు ఆమెపై బుధవారం నాడు కత్తితో దాడికి  దిగాడు. 

సోదరి గొంతు కోశాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఈ విషయాన్ని గుర్తించడంతో  నిందితుడు పారిపోయాడు. స్థానికులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు.

ఆసుపత్రిలో ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతుంది. దివ్యాంగుడిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకే దాడి చేసినట్టుగా నిందితుడు చెప్పినట్టు సమాచారం.
 

PREV
click me!

Recommended Stories

నన్ను సార్ అంటే చాక్లెట్ ఇవ్వాలి విద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Nara Lokesh Fun With Students
Nara Lokesh Speech: టీడీపీ కార్యకర్తలకు పూనకాలు తెప్పించే నారాలోకేష్ పవర్ ఫుల్ స్పీచ్ | TDP