పల్నాడులో దారుణం.. 30 సెంట్ల స్థలం కోసం అన్న కూతురిని కత్తితో నరికి, బాబాయ్‌ ఘాతుకం

Siva Kodati |  
Published : Jun 21, 2022, 06:40 PM ISTUpdated : Jun 21, 2022, 08:58 PM IST
పల్నాడులో దారుణం.. 30 సెంట్ల స్థలం కోసం అన్న కూతురిని కత్తితో నరికి, బాబాయ్‌ ఘాతుకం

సారాంశం

పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం యన్నాదేవీలో అన్నకూతురిని బాబాయ్ కత్తితో నరికాడు. కేవలం 30 సెంట్ల భూమి కోసం ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. 

మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. ఆస్తుల కోసం అయిన వారినే అంతం చేస్తున్నారు. కేవలం 30 సెంట్ల స్థలం కోసం ఓ వ్యక్తి ఉన్మాదిగా మారిపోయాడు. కూతురి వయసయ్యే యువతి పైనే కత్తి దూశాడు. నడిరోడ్డు మీద విచక్షణారహితంగా కత్తితో నరికాడు. పల్నాడు జిల్లా (palnadu distrirct) సత్తెనపల్లి (sattenapalle) మండలం యన్నాదేవీలో జరిగింది ఈ కిరాతక పర్వం ఆస్తి వివాదంలో అన్న కూతురిపైనే బాబాయ్ దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలని స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్ధితి విషమంగా వున్నట్లుగా తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Tirumala : శ్రీవారి భక్తులను గుడ్ న్యూస్.. అందుబాటులోకి 32 EV బస్సులు, ఇకపై ఫ్రీ జర్నీ
Annadhanam Spots : ఏమండోయ్ బ్యాచిలర్స్.. ఎక్కడ, ఎప్పుడు, ఏఏ పదార్థాలతో అన్నదానం జరుగుతుందో ఈజీగా తెలుసుకోండి