ఒకరితో సహజీవనం.. మరొకరితో సంబంధం.. ముగ్గురూ ఒకేగదిలో ఉంటూ.. చివరకు...

Published : Mar 05, 2022, 09:37 AM IST
ఒకరితో సహజీవనం.. మరొకరితో సంబంధం.. ముగ్గురూ ఒకేగదిలో ఉంటూ.. చివరకు...

సారాంశం

ఒకరితో సహజీవనం చేస్తూ.. కొత్తగా పరిచయం అయిన వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని.. ముగ్గురూ ఒకే గదిలో ఉంటూ రహస్యంగా సంబంధం కొనసాగించడం... ఓ వ్యక్తి దారుణ హత్యకు దారి తీసింది. 

క్రిష్ణాజిల్లా : Extramarital affair ఓ వ్యక్తి దారుణ murderకు దారి తీసింది. నందిగామ పట్టణంలోని ఎస్ సీఆర్ క్లబ్ రోడ్డులో గురువారంతెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు అందించిన వివరాల మేరకు.. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన గుత్తి విజయ్, ఉష కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. మూడు రోజుల క్రితం నందిగామలోని ఓ hotelలో పని చేసేందుకు వచ్చారు. 

ఈ క్రమంలో ఉషకు వరి అప్పాజీ అనే వ్యక్తితో కొంతకాలంగా పరిచయం ఏర్పడింది. ప్రస్తుతం ఆ ముగ్గురు కూడా ఒకే గదిలో నివాసం ఉంటున్నారు. ఉష, అప్పాజీతో కూడా బాగా చనువుగా ఉంటోంది. అది నచ్చని విజయ్ నిద్రపోతున్న అప్పాజీని knifeతో పీక కోసి హతమార్చాడు. ఆ సమయంలో అడ్డొచ్చిన ఉషకు కూడా తీవ్ర గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. 

కాగా, మధ్యప్రదేశ్ లో ఇలాంటి దారుణమే జరిగింది. సాక్షాత్తు  కట్టుకున్న husband తన wifeను ఇంట్లో ప్రియుడితో కలిసి చూడరాని  స్థితిలో చూశాడు. ఇక ఆ భర్త తట్టుకోలేకపోయాడు. ఇద్దరినీ పట్టుకుని చెట్టుకు కట్టేసి మరీ చితకబాదాడు. ఈ సంఘటన madhyapradeshలోని రాజ్ ఘర్ ప్రాంతంలో మార్చి 3న జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… భర్త కళ్లుగప్పి ఓ మహిళ చెయ్యకూడని తప్పు చేసింది. భర్త లేని సమయంలో ప్రియుడితో కలిసి ఇంట్లోనే extramarital affairని గత కొన్నాళ్లుగా కొనసాగిస్తూ వచ్చింది. 

అయితే ఎట్టకేలకు ఆ వివాహిత నిజస్వరూపం బయటపడింది. కాగా ఓ రోజు ఇంట్లోనే తన భార్యను మరో వ్యక్తితో చూడడంతో భర్త తట్టుకోలేకపోయాడు. భార్య చేసిన తప్పుడు పని గ్రామస్తులు అందరికీ తెలియజేయాలనుకున్నాడు ఆ భర్త. దాంతో ఊరి మధ్యలో ఉన్న ఓ చెట్టుకు కట్టేసి భార్యతో పాటు తన ప్రియుడికి కూడా దేహశుద్ధి చేశారు. వివాహితతో పాటు ఆమె ప్రియుడికి దేహశుద్ధి చేయడానికి సదరు భర్త బంధువులు కూడా అతనికి అండగా నిలిచారు. ఇలా రెండు గంటల పాటు ఇద్దరిని చితకబాదుతుండగా.. వాళ్ళ అరుపులు విని స్థానికులు అక్కడికి చేరుకున్నారు.
 
అయితే స్థానికులు దీనికి సంబంధించిన దృశ్యాలను షూట్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వార్త వైరల్ అయింది. భర్తతో కాపురం చేస్తూనే మరో వైపు ప్రియుడితో కలిసి తన ఇంట్లోనే వివాహేతర సంబంధం నడుపుతున్న విషయం బయట పడడంతో గ్రామస్తులు కూడా వివాహితపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో భర్త దేహశుద్ధి చేస్తుండగా అందరూ అతనికి మద్దతుగా నిలిచి మహిళను తిట్టి పోశారు. 

ఇదిలా ఉండగా  సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని చెట్టుకు కట్టేసి వివాహితతో పాటు ఆమె ప్రియుడిని కూడా పోలీస్ స్టేషన్కు తరలించారు. తర్వాత పూర్తి వివరాలు సేకరించిన పోలీసులు.. భార్య తప్పు చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి కానీ వారిని శిక్షించడాన్ని తప్పుపట్టారు. వారిపై దాడి చేసిన భర్తపై కేసు నమోదు చేసి స్టేషన్కు తరలించారు. ఆ తర్వాత భార్య భర్తలు ఇద్దరిని కలిపేందదుకు వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

YS Jagan Comments: సిసి టివి ఫుటేజ్ మాయం చేశారు పోలీస్ ల తీరుపై జగన్ ఫైర్| Asianet News Telugu
విజయవాడలో పరామర్శకు వెళ్లిన జగన్ క్రేజ్ చూడండి | Jagan Visit Kranti Kumar Family | Asianet Telugu