నువ్వు చనిపోతావ్, నీ భార్య రెండో పెళ్లి చేసుకుంటుంది.. జ్యోతిష్యుడు పెట్టిన చిచ్చు..చివరికి..

Published : Jul 08, 2022, 01:26 PM IST
నువ్వు చనిపోతావ్, నీ భార్య రెండో పెళ్లి చేసుకుంటుంది.. జ్యోతిష్యుడు పెట్టిన చిచ్చు..చివరికి..

సారాంశం

ఓ వ్యక్తికి నువ్వు చనిపోతావ్ అంటూ ఓ జ్యోతిష్యుడు చెప్పాడు. అంతేకాదు అతని భార్య రెండో పెళ్లి చేసుకుంటుందని చెప్పాడు. దీంతో అతను తన అన్నను హత్య చేశాడు. 

విజయవాడ : తన కుటుంబం గురించి అసభ్యంగా ప్రచారం చేస్తున్నాడు అనే కారణంతో ఓ వ్యక్తి దారుణ హత్యకు పాల్పడిన ఘటన స్థానిక సీతారాంపురం కొత్తవంతెన సెంటర్ వద్ద బుధవారం రాత్రి చోటు చేసుకుంది. కొత్తవంతెన సెంటర్ లో నివాసముంటున్న నిందితుడు గడ్డం బాబు.. అదే ప్రాంతంలో ఉండే తన పెదనాన్న కొడుకు రత్నాల తంబిని కత్తితో పొడిచి హత్య చేసినట్టు సుబ్బారావుపేట సీఐ జానకిరామయ్య తెలిపారు. అసలు ఈ హత్య ఎందుకు జరిగింది? పెదనాన్న కొడుకుని ఎందుకు చంపాడు? ఆస్తి తగాదాలా? దాయాదుల గొడవలా? వివరాల్లోకి వెళితే…

నిందితుడు గడ్డంబాబుది నెల్లూరు జిల్లా కావలి. రెండేళ్ళ క్రితం వీరి కుటుంబం విజయవాడకు వచ్చి స్థిరపడింది. విజయవాడలోని సీతారామపురం కొత్త వంతెన సెంటర్ వద్ద అద్దె ఇంట్లో బాబు కుటుంబం నివాసం ఉంటుంది. అదే ప్రాంతంలోని వేరే ఇంట్లో హతుడు రత్నాల తంబి (40) కుటుంబం నివాసం ఉంటుంది. తంబి కొత్త వంతెన వద్ద  జామకాయలు అమ్ముతాడు. ఇలా వచ్చిన ఆదాయంతోనే జీవిస్తుంటాడు. కాగా, గడ్డం బాబు పెయింటర్ గా పని చేస్తాడు. అప్పుడప్పుడు రాపిడో బైక్  క్యాబ్ నడుపుతుంటాడు. 

అయితే దీనికి సొంతంగా ద్విచక్ర వాహనం ఉండాల్సి ఉంది. సొంత వాహనం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నానని, ఎక్కడైనా  ఫైనాన్స్ పై వాహనం ఇప్పించమని కొన్ని రోజుల క్రితం బాబు, తంబిని కోరాడు.ఫైనాన్స్ మీద వాహనం దొరక్కపోవడంతో జీవితంలో ఆర్థిక ఇబ్బందులను తొలగించుకునేందుకు ఏదైనా మార్గం ఉందా అని జాతకం చూపించుకోవాలి అని అనుకున్నాడు.

బాబు నివాసముండే ఇంట్లోనే వేరే పోర్షన్లో ఓ జ్యోతిష్కుడు అద్దెకు ఉంటున్నాడు. జ్యోతిష్కుడిని బాబు, తంబి పది రోజుల క్రితం కలిశారు. అతను బాబు జ్యోతిషం చూసి అతని జాతకంలో దోషం ఉంది అని,  త్వరలో గడ్డం బాబు చనిపోతాడని చెప్పాడు. అంతటితో ఆగకుండా, అతను చనిపోయిన తర్వాత ఆయన భార్య రెండో వివాహం చేసుకుంటుందని జ్యోతిష్యుడు చెప్పాడు. ఈ మాటలతో ఇద్దరూ ఖంగుతిన్నారు. వెంటనే అక్కడి నుంచి వచ్చేసారు. వీరిద్దరు తరచుగా  కొత్త వంతెన వద్ద మద్యం తాగుతూ ఉంటారు.

చిత్తూరులో ఘోరం... ఆర్టిసి బస్సు-లారీ ఢీ, 13మందికి గాయాలు

అయితే జ్యోతిష్యుడు చెప్పిన మాటలు తంబి వినడంతో..  ఆ ప్రాంతాలలోని వారికి, బంధువులకు చెప్పి తనను అల్లరి చేస్తున్నాడని బాబు అనుమానించాడు. ఇదే విషయం మీద రెండు రోజుల క్రితం ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.  తన భార్య రెండో పెళ్లి చేసుకోబోతోంది అని  ప్రచారం చేస్తున్న తంబిని హత్య చేయాలని బాబు నిర్ణయించుకున్నాడు. బుధవారం రాత్రి బాబు మద్యం సేవించిన తర్వాత.. కొత్త వంతెన దగ్గర జామకాయలు అమ్ముతున్న తంబి మీద కత్తితో దాడి చేసి పరారయ్యాడు. 

తీవ్ర రక్తస్రావంతో తంబి సమీపంలోని తన సోదరి పనిచేసే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చేరుకున్నాడు. అయితే గొంతు మీద తీవ్ర గాయం కావడంతో కొద్దిసేపటికే తండ్రి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. హతుడు  తంబి  సోదరి జ్యోతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తంబికి భార్య,  ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్